Ramayana Update: మరింత ప్రతిష్ఠాత్మకం అవుతోన్న రామాయణ.. మేకర్స్‌ ఆసక్తికర అప్‌డేట్‌

Ramayana Update: మరింత ప్రతిష్ఠాత్మకం అవుతోన్న రామాయణ.. మేకర్స్‌ ఆసక్తికర అప్‌డేట్‌
x

Ramayana Update: మరింత ప్రతిష్ఠాత్మకం అవుతోన్న రామాయణ.. మేకర్స్‌ ఆసక్తికర అప్‌డేట్‌

Highlights

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న చిత్రం ‘రామాయణ’ (Ramayana) ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పుతోంది. ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారీ (Nitesh Tiwari) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా, సాయిపల్లవి (Sai Pallavi) సీతగా, యశ్ (Yash) రావణుడిగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ వీడియోతో సినిమాపై ఆసక్తి రెట్టింపైంది.

Ramayana Update: బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న చిత్రం ‘రామాయణ’ (Ramayana) ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పుతోంది. ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారీ (Nitesh Tiwari) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా, సాయిపల్లవి (Sai Pallavi) సీతగా, యశ్ (Yash) రావణుడిగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ వీడియోతో సినిమాపై ఆసక్తి రెట్టింపైంది.

తాజాగా చిత్ర బృందం ఓ కీలక అప్‌డేట్‌ను పంచుకుంది. ప్రపంచవ్యాప్తంగా 10 వేల మంది నటీనటులు, టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నారని వెల్లడించారు. ఇందులో ఒకేసారి 4 వేల మంది కలసి పనిచేసిన ఘట్టాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఇదే విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో పంచుతూ, “హాలీవుడ్‌ ప్రాజెక్ట్స్ అయిన అవతార్, డ్యూన్ సినిమాలకు పనిచేసిన వారి కంటే రెట్టింపు టెక్నికల్ బృందం ఈ దృశ్య కావ్యంలో భాగమైంది” అని తెలిపారు.

ఈ ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. మొత్తం రూ.1600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో, మొదటి భాగం రూ.900 కోట్లు, రెండో భాగం రూ.700 కోట్లు ఖర్చవుతుందని సమాచారం. ప్రస్తుతం మొదటి భాగం షూటింగ్ పూర్తయింది. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చిత్ర బృందం ప్రకారం, ‘రామాయణ: పార్ట్ 1’ ను 2026 దీపావళికి, ‘రామాయణ: పార్ట్ 2’ ను 2027 దీపావళికి విడుదల చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories