"రామం రాఘవం" సినిమా నుంచి "తెలిసిందా నేడు" సాంగ్.. రిలీజ్ చేసిన డైరెక్టర్ సుకుమార్..!

Ramam Raghavam Movie Song Released by Sukumar
x

"రామం రాఘవం" సినిమా నుంచి "తెలిసిందా నేడు" సాంగ్.. రిలీజ్ చేసిన డైరెక్టర్ సుకుమార్..!

Highlights

గురుపూజోత్సవం సందర్బంగా రామం రాఘవం మూవీ నుంచి 'తెలిసిందా నేడు' పాటను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు.

Ramam Raghavam: స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణంలో తెరకెక్కుతున్న ద్విభాష చిత్రం "రామం రాఘవం". నటుడు ధనరాజ్ కొరనాని మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

గురుపూజోత్సవం సందర్బంగా ఈ మూవీ నుంచి 'తెలిసిందా నేడు' పాటను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. ఎమోషనల్‌గా సాగే ఈ మెలోడీ సాంగ్ విడుదలైన కొద్దిసేపటిలోనే వైరల్ అవ్వడం విశేషం. తండ్రి కొడుకు మధ్య ఉండే ఎమోషన్‌ను కరెక్ట్‌గా కాప్చర్ చేస్తూ చిత్రీకరించిన ఈ సాంగ్‌ను అరుణ్ చిలువేరు సంగీతం అందించగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.

ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సునీల్, సత్య, పృద్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు విమానం దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథను అందించగా అరుణ్ చిలువేరు సంగీతం సమకూర్చారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్, దుర్గా ప్రసాద్ ఈ సినిమాకు కెమెరామెన్.

రామం రాఘవం సినిమాలోని పాటలను రామజోగయ్య శాస్త్రి రాశారు, హైదరాబాద్, అమలా పురం, రాజమండ్రి, రాజోలు, చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న 'రామం రాఘవం' తమిళ, తెలుగు భాషలలో ఒకేసారి త్వరలో విడుదల కానుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories