"రామారావు అన్ డ్యూటీ" విడుదల తేదీ ఖరారు

Rama Rao on Duty Movie Team Announced the Release Date
x

విడుదల తేదీ ప్రకటించిన "రామారావు ఆన్ డ్యూటీ" బృందం

Highlights

"రామారావు అన్ డ్యూటీ" విడుదల తేదీ ఖరారు

Rama Rao on Duty Movie: "క్రాక్" తో సూపర్ హిట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ తాజాగా "కిలాడి" అనే సినిమాతో పర్వాలేదనిపించారు. తాజాగా ఇప్పుడు రవితేజ తన తదుపరి సినిమా "రామారావు ఆన్ డ్యూటీ" తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు దర్శక నిర్మాతలు.

ఈ సినిమా జూన్ 17న థియేటర్లలో విడుదల అవుతోంది. చాలావరకు పెద్ద సినిమాలన్నీ వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి కాబట్టి జూన్ లో తమ సినిమాను విడుదల చేస్తే బాగుంటుందని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా విడుదల తేదీని ప్రకటిస్తూ దర్శకనిర్మాతలు ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియా లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

అతి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లు మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. మజిలి బ్యూటీ దివ్యాన్ష కౌశిక్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రజిష విజయన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాకి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఎల్ వి సినిమాస్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories