బడ్జెట్ తగ్గితే కానీ పట్టాలెక్కేలా లేని రామ్ సినిమా

Ram Pothinenis Film is Delayed Due to Budget | Tollywood News
x

బడ్జెట్ తగ్గితే కానీ పట్టాలెక్కేలా లేని రామ్ సినిమా

Highlights

*బడ్జెట్ తగ్గితే కానీ పట్టాలెక్కేలా లేని రామ్ సినిమా

Ram Pothineni Movie: "ఇస్మార్ట్ శంకర్" సినిమాతో యువ హీరో రామ్ పోతినేని కరియర్ లోనే మంచి హిట్ను అందుకున్నారు కానీ అదే జోరుతో రామ్ నటించిన బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. ఈ సినిమాతో రామ్ కరియర్ కు మళ్ళీ బ్రేకులు పడ్డట్టుగా అయింది. తాజా సమాచారం ప్రకారం రామ్ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. కానీ గత కొద్ది రోజులుగా బడ్జెట్ కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలవడం లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి.

శ్రీనివాస్ చిట్టూరి కూడా ఈ సినిమా నిర్మాతలలో ఒకరు. రామ్ పోతినేని మరియు బోయపాటి శ్రీను లతో సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాల్సి ఉంది.కానీ "ది వారియర్" సినిమాతోనే శ్రీనివాస్ చిట్టూరి చాలా డబ్బులను నష్టపోయారు. తాజాగా ఇప్పుడు నాగచైతన్య హీరోగా వెంకట ప్రభు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ సినిమా ఇబ్బందుల్లో పడ్డట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలోనే సినిమా షూటింగ్ కి సంబంధించిన కొన్ని షెడ్యూల్స్ ను ప్రకటించారు. కానీ ఆఖరి నిమిషంలో వీటిని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. బోయపాటి మరియు రామ్ ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ను డిమాండ్ చేస్తున్నారట కానీ బడ్జెట్ ను కొంత తగ్గిస్తే తప్ప షూటింగ్ పట్టాలు ఎక్కే అవకాశాలు కనిపించడం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories