డిజాస్టర్ గా మారిపోతున్న రామ్ సినిమా

Ram Movie is Turning into a Disaster
x

డిజాస్టర్ గా మారిపోతున్న రామ్ సినిమా 

Highlights

Ram Movie: భారీగా తగ్గిపోయిన "ది వారియర్" కలెక్షన్లు

Ram Movie: ఈ మధ్యనే "ఇస్మార్ట్ శంకర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో రామ్ "రెడ్" సినిమాతో అంతగా మెప్పించలేకపోయింది. తాజాగా ఇప్పుడు తమిళ్ డైరెక్టర్ ఎన్ లింగు స్వామి దర్శకత్వంలో "ది వారియర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమాలో హీరో ఆది పినిశెట్టి మెయిన్ విలన్ పాత్రలో కనిపించారు. "ఉప్పెన" బ్యూటీ కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా అక్షర గౌడ మరియు నదియ ముఖ్య పాత్రలు పోషించారు. మంచి అంచనాల మధ్య ఈ సినిమా జులై 14 న థియేటర్లలో విడుదలైంది.

థియేట్రికల్ రైట్స్ తో 35 కోట్ల వరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను చేసింది. కానీ మొదటి రోజు నుంచి సినిమా కలెక్షన్లు అంతంత మాత్రం గానే ఉన్నాయి. విడుదలైన మొదటి రోజు కేవలం 6 కోట్లు మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా 17% మాత్రమే వెనక్కి తీసుకురాగలిగింది. రెండవ రోజు సినిమా కలెక్షన్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్లు మరింతగా పడిపోయాయి. ఇక సినిమా ఫైనల్ రన్ పూర్తయ్యే లోపల కనీసం 50% రికవరీ అయినా ఉండకపోవచ్చు అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. చూస్తూ ఉంటే "ది వారియర్" సినిమా రామ్ కరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా మారబోతోంది. ఇక మొదటి వారంతం తర్వాత సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందేమో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories