అక్కడ రామ్ సినిమాకి క్రేజ్ మామూలుగా లేదుగా !

అక్కడ రామ్ సినిమాకి క్రేజ్ మామూలుగా లేదుగా !
x
Hero ram ( file photo )
Highlights

టాలీవుడ్ యంగ్ హీరోలలో రామ్ ఒకరు. దేవదాస్ సినిమాతో చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యాడు రామ్. మొదట్లో పెద్దగా హిట్స్

టాలీవుడ్ యంగ్ హీరోలలో రామ్ ఒకరు. దేవదాస్ సినిమాతో చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యాడు రామ్. మొదట్లో పెద్దగా హిట్స్ రాకపోయిన ఆ తర్వాత హిట్టు మీద హిట్టు కొట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక అమ్మాయిల అయితే రామ్ ని చాక్లెట్ బాయ్‌ గా పిలుస్తారు. కేవలం రామ్ సినిమాలకి రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు. ఉత్తరాదిలో కూడా మంచి క్రేజ్ ఉంది.

రామ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం హలో గురు ప్రేమ కోసమే. ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలో కనిపించిన ఈ సినిమాకి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో 'దిల్' రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేకపోయారు.

ఈ సినిమాని హిందీ డబ్బింగ్ డిజిటల్ రైట్స్‌ను ఆదిత్య మూవీస్ సంస్థ కొనుగోలు చేసింది. హిందీలో 'దుందార్ ఖిలాడీ'గా అనువాదం చేసి యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఈ సినిమాని హిందీ ప్రేక్షకులు మాత్రం యూట్యూబ్‌లో ఇరగబడి చూస్తున్నారు. చూడడమే కాదు అద్భుతంగా ఉందని అంటూ లైక్స్ మీదా లైక్స్ కొడుతున్నారు. ఈ ఏడాది జులైలో ఈ సినిమాను యూట్యూబ్‌లో విడుదల చేయగా ఇప్పటి వరకు 140 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. తాజాగా యూట్యూబ్‌లో అతివేగంగా 1 మిలియన్ లైక్స్‌ను సొంతం చేసుకున్న ఏకైక సౌతిండియన్ సినిమాగా 'దుందార్ ఖిలాడీ' నిలిచింది.

ఈ సంవత్సరం ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఆకట్టుకున్న రామ్ ప్రస్తుతం రెడ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని స్రవంతి రవికిషోర్ నిర్మిస్తుండగా, కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. నివేదా పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో సినిమాని విడుదల చేయనున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories