మళ్లీ ద్విపాత్రాభినయం చేయబోతున్న రామ్

Ram is Going to Play a Double Role Again | Tollywood News
x

మళ్లీ ద్విపాత్రాభినయం చేయబోతున్న రామ్

Highlights

*మళ్లీ ద్విపాత్రాభినయం చేయబోతున్న రామ్ (

Ram Pothineni: ఈ మధ్యనే బాలకృష్ణ హీరోగా నటించిన "అఖండ" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు బోయపాటి శ్రీను. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో మూడవ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన "అఖండ" బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద హిట్ గా నిలచింది. ఇక ఈ సినిమా తర్వాత యువ హీరో రామ్ పోతినేని హీరోగా ఒక సినిమా చేయబోతున్నారు బోయపాటి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు "రెడ్" సినిమాలో కూడా రామ్ డ్యూయల్ రోల్ పోషించారు.

తాజాగా మళ్లీ బోయపాటి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా కోసం కూడా మళ్లీ ద్విపాత్రాభినయం చేయడానికి సిద్ధమవుతున్నారు రామ్. అయితే అందులో ఒక పాత్రలో రామ్ ఇంతకు మునుపెన్నడూ కనిపించనంటువంటి మాస్ అవతారంలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇక హీరో రామ్ ప్రస్తుతం లింగుస్వామి డైరెక్షన్ లో "ది వారియర్" సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత బోయపాటితో సినిమా పట్టలెక్కనుంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories