బాలీవుడ్ నటిపై ఆర్జీవీ సంచలన ట్వీట్.. వెంటనే డిలీట్‌

బాలీవుడ్ నటిపై ఆర్జీవీ సంచలన ట్వీట్.. వెంటనే డిలీట్‌
x
Highlights

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ యూ టర్న్ తీసుకున్నారు.

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ యూ టర్న్ తీసుకున్నారు. రామ్ గోపాల్ వర్మ ఏంటి యూ టర్న్ తీసుకోవడం ఏంటా అనుకుంటున్నారా?. అవును మీరు నమ్మలేకున్నా.. ఇది మాత్రం నిజమే. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, నటీ కంగనాపై పెట్టిన పోస్ట్ ను ఆర్జీవి వెనక్కి తీసుకున్నారు. నటి కంగనా రనౌత్ పై ప్రసంశలు కురిపిస్తూ ట్వీట్‌ చేశాడు. అయితే ఏమైందో ఏమో కానీ వెంటనే సదరు ట్వీట్‌ను డెలిట్ చేశాడు.

ఇంతకి అసలు విషయం ఏమిటంటే కంగనా రనౌత్‌ ధాకడ్‌ చిత్రీకరణలోని చేతిలో పొడవాటి తుపాకీ పట్టుకుని, ముఖంపై రక్తంతో యాక్షన్‌ సీన్‌లో పూర్తిగా ఇన్వాల్‌ అయి ఉన్న ఫొటోను ట్వీటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆమె హార్డ్‌ వర్క్‌ ఫొటోలో స్ఫష్టంగా కనిపిస్తోంది.

కాగా.. చాలామంది కంగనా పనితనాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆర్జీవీ కూడా ఈ ఫొటో చూసి స్పందించకుండా ఉండలేకపోయాడు. నా సినీ కెరీర్‌లో నేను చూసిన బెస్ట్‌ క్లోజ్‌అప్‌ ఫొటో ఇది. పాత్రలో ఈ రేంజ్‌లో లీనమైన నటి ఎవరైనా ఉన్నారా? అంటే అసలు ఒక్కరు కూడా గుర్తుకు రావడం లేదు. నీలాంటి నటిని ఇదివరకెన్నడూ చూడలేదు. హే కంగనా నువ్వో న్యూక్లియర్‌ బాంబ్‌ అని ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశాడు. ఆర్జీవి వెనక్కి తగ్గడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఇక కంగనా నటిస్తోన్న థాకడ్ మధ్యప్రదేశ్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories