షూటింగ్‌లో రామ్‌కు గాయాలు.. వైరల్ వీడియో

షూటింగ్‌లో రామ్‌కు గాయాలు.. వైరల్ వీడియో
x
Ram Pothineni File photo
Highlights

పోరాట సన్నీవేశాల్లో సీక్వెన్స్‌లో రామ్ కు గాయమైనట్లు తెలుస్తోంది.

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ ఇస్మార్ట్ శంకర్‌ సినిమాతో ఈ సంవత్సరం టాలీవుడ్ లో అతి పెద్ద సూపర్ హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అప్పటి వరకూ ఒడిదుడుకులతో సాగుతున్న రామ్ కెరీర్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. కొన్నేళ్లుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్‌కే కాకుండా దర్శకుడు పూరీజగన్నాథ్‌ను కూడా ఇండస్ట్రీలో నిలబెట్టింది.

అయితే వీరిద్దరూ వరస చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు. ఇక రామ్ విషయానికి వస్తే ఓ తమిళ రీమేక్‌లో చిత్రంలో నటిస్తున్నారు.రామ్ నటిస్తున్న చిత్రానికి రెడ్ (RED) అనే పేరును చిత్ర బృందం ఖారారు చేసింది. అయితే ఈ చిత్రం మొదలు పెట్టిన రోజు విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ఎంత వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు. రామ్ ఈ చిత్రంలో రెండు పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రెండు ఢిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో రామ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని సమాకూర్చుతున్నారు.

కాగా.. ఈ సినిమా షూటింగ్ పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం. ఈ పోరాట సన్నీవేశాల్లో సీక్వెన్స్‌లో రామ్ కు గాయమైనట్లు తెలుస్తోంది. తనకు గాయమైనట్లు చూపిస్తూ ఓ వీడియోలో చూపించారు. ఈ సందర్భంగా ట్విట్ చేసిన రామ్ మాట్లాడుతూ.. పీటర్ గ్రేట్ ఫైట్ నిన్న డిజైన్ చేశావు. నిన్ను నేను అసలు విస్ కావడం లేదు. అందుకే ఈ వీడియో చేశారు. నీ ప్రేమ కనిపించడంలేదు కానీ అనుభూతి చెందుతాను, నువ్విచ్చే నొప్పి కూడా కనిపించదు.లవ్ రెడ్ ఫైట్ అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన రామ్ అభిమానులు కంగారు పడుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories