యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన రామ్ డిజాస్టర్ సినిమా

Ram Disaster Movie Created A Sensation On YouTube
x

యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన రామ్ డిజాస్టర్ సినిమా

Highlights

* రామ్ నటించిన ఏడు సినిమాలు హిందీలో 100 మిలియన్ న్యూస్ ను అందుకొని ఇప్పుడు రికార్డు సృష్టించాయి.

The Warrior: తమిళ్ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన "ది వారియర్" సినిమా తెలుగులో మాత్రమే కాక తమిళ్లో కూడా విడుదలైంది. కానీ అనుకున్న స్థాయిలో విజయాన్ని మాత్రం సాధించలేకపోయింది. కానీ తాజాగా ఇప్పుడు ఈ సినిమా యూట్యూబ్ లో మాత్రం పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ మధ్యనే యూట్యూబ్ లో విడుదలైన ఈ చిత్ర హిందీ డబ్ వర్షన్ 100 మిలియన్ వ్యూస్ ను కేవలం ఒక నెల రోజుల గడుపులోనే చేరుకుంది. థియేటర్లలో సినిమాకి వచ్చిన రెస్పాన్స్ తో పోలిస్తే ఇది ఒక సంచలనం అనే చెప్పాలి.

ఎందుకంటే తెలుగు మరియు తమిళ భాషలలో ఈ సినిమా అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. నిజానికి రామ్ సినిమాలకి హిందీ లో వస్తున్న ఈ క్రేజ్ కొత్తదేమీ కాదు. గతంలో కూడా థియేటర్లలో ఫ్లాప్ అయిన చాలా వరకు రామ్ సినిమాలు హిందీలో మాత్రం మంచి విజయాన్ని సాధించాయి. మొట్టమొదటిసారిగా రామ్ హీరోగా నటించిన "గణేష్" సినిమా హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత రామ్ నేను శైలజ సినిమా తెలుగులో హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఇక హిందీలో కూడా ఆ సినిమా యూట్యూబ్లో 100 మిలియన్ వ్యూస్ అందుకుంది. హైపర్, ఇస్మార్ట్ శంకర్, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే, వంటి సినిమాలు కూడా హిందీలో మంచి విజయాన్ని సాధించి 100 మిలియన్ వ్యూస్ ను అందుకున్నాయి. తాజాగా ఇప్పుడు "ది వారియర్" సినిమా ఈ జాబితాలో కొత్తగా చేరింది. అయితే వరుసగా రామ్ నటించిన ఏడు సినిమాలు హిందీలో 100 మిలియన్ న్యూస్ ను అందుకొని ఇప్పుడు రికార్డు సృష్టించాయి. త్వరలోనే రామ్ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories