పక్క రాష్ట్రాల్లో సందడి చేయనున్న మెగా పవర్ స్టార్ సినిమా

మెగా పవర్ స్టార్ రాంచరణ్ 'రంగస్థలం' సినిమాతో కెరీర్ లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. బాక్సాఫీస్...
మెగా పవర్ స్టార్ రాంచరణ్ 'రంగస్థలం' సినిమాతో కెరీర్ లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్ల పంట పండించింది. చెవిటివాడిగా రామ్ చరణ్ నటన ఈ సినిమాకి హైలైట్ గా మారింది. 120 కోట్ల షేర్ ను రాబట్టి ఈ చిత్రం టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేస్తూ, నాన్ బాహుబలి జాబితాలో మొట్టమొదటి స్థానాన్ని గెలుచుకుంది. ఇప్పటిదాకా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఇప్పుడు వేరే భాష ప్రేక్షకుల వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తాజా సమాచారం ప్రకారం 'రంగస్థలం' సినిమా మలయాళం, కన్నడ మరియు తమిళ భాషల్లో విడుదల కానుంది.
ఈ సినిమా త్వరలోనే ఈ నెలలోనే విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం. తెలుగు సినిమాలు తమిళ, మలయాళ భాషల్లో డబ్ అవ్వడం ఎప్పుడు జరిగే పనే కానీ కన్నడలో మాత్రం ఇది రేర్ అని చెప్పుకోవచ్చు. మరి తెలుగు ప్రేక్షకులను బీభత్సంగా బాగా మెప్పించిన ఈ సినిమా మిగతా మూడు భాషల్లో ప్రేక్షకులను ఎంతవరకూ అలరిస్తుందో వేచి చూడాల్సి ఉంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ పీరియడ్ డ్రామా లో సమంత హీరోయిన్ గా నటించగా, ఆది పినిశెట్టి మరియు ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు.
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
Cyber Crime: అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలు
20 May 2022 3:45 AM GMTఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా
20 May 2022 3:21 AM GMTHyderabad: జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులను వేధిస్తున్న జీతం కట్ సమస్య
20 May 2022 2:47 AM GMTవిశాఖ స్టీల్ ప్లాంట్ భూముల లెక్కలపై అయోమయం
20 May 2022 2:27 AM GMTCM Jagan: నేటి నుంచి సీఎం జగన్ విదేశీ పర్యటన
20 May 2022 2:16 AM GMT