Rai Rai Ra Ra Song: ‘పెద్ది’ పాటల సంచలనం.. 24 గంటల్లో 31 మిలియన్ వ్యూస్‌తో ‘రై రై రా రా’ రికార్డ్!

Rai Rai Ra Ra Song
x

Rai Rai Ra Ra Song: ‘పెద్ది’ పాటల సంచలనం.. 24 గంటల్లో 31 మిలియన్ వ్యూస్‌తో ‘రై రై రా రా’ రికార్డ్!

Highlights

Rai Rai Ra Ra Song: ‘రై రై రా రా’ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం తెలుగు వెర్షన్‌లోనే విడుదలైన 24 గంటల్లో 31 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ఆల్ టైమ్ రికార్డ్‌ను నెలకొల్పింది.

Rai Rai Ra Ra Song: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది'. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి రోజురోజుకు హైప్ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా పెద్ది నుంచి రిలీజ్ అవుతున్న పాటలు సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతున్నాయి.

‘చికిరి చికిరి’ తర్వాత ‘రై రై రా రా’ దుమ్మురేపుతోంది:

పెద్ది చిత్రంలోని తొలి పాట ‘చికిరి చికిరి’ ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచి సోషల్ మీడియాలో భారీ స్పందన తెచ్చుకుంది. తాజాగా వచ్చిన రెండో సాంగ్ ‘రై రై రా రా’ మాత్రం మరింత మాస్ ఇంపాక్ట్‌తో దూసుకుపోతోంది. ఈ పాట మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుని పాన్ ఇండియా లెవల్లో ట్రెండ్ అవుతోంది.

24 గంటల్లో 31 మిలియన్ వ్యూస్:

తాజాగా ‘రై రై రా రా’ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం తెలుగు వెర్షన్‌లోనే విడుదలైన 24 గంటల్లో 31 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ఆల్ టైమ్ రికార్డ్‌ను నెలకొల్పింది. ఇదే విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. 5.30 లక్షలకు పైగా లైక్స్ రావడం ఈ పాటకు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ఇట్టే అర్ధమవుతోంది.

ఏఆర్ రెహమాన్ మాస్ ట్యూన్.. చరణ్ ఎనర్జీ హైలైట్:

ఈ సాంగ్‌కు సంగీతాన్ని ఏఆర్ రహమాన్ అందించారు. ఆయన మాస్ ట్యూన్‌కు రామ్ చరణ్ ఎనర్జీ జతకావడంతో పాట మరింత వైరల్ అయింది. అభిమానులు ఈ సాంగ్‌ను లూప్ మోడ్‌లో వింటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఏప్రిల్ 30న గ్రాండ్ రిలీజ్:

ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వృద్ధి సినిమాస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పెద్ది చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 30న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. మొత్తానికి, ‘పెద్ది’ పాటలతోనే భారీ సంచలనం సృష్టిస్తోంది. సినిమా విడుదలకు ముందే ఈ స్థాయి రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టిస్తుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories