
Ram Charan
Ram Charan: రామ్ చరణ్ పెద్ది మూవీ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ కి రామ్ చరణ్ డాన్స్ మ్యాజిక్ తో ఫాన్స్ కు పూనకాలు తెప్పించారు
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద మరో సునామీ సృష్టించేందుకు సిద్ధమయ్యారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన చరణ్, ఇప్పుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'పెద్ది' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, "చికిరి చికిరి" సాంగ్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే జోష్‌ను రెట్టింపు చేస్తూ మేకర్స్ రెండో సింగిల్ 'రై రై రా రా'ను విడుదల చేశారు. ఈ పాట మెగా అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది.
ఈ పాటలో విశేషం ఏమిటంటే.. స్వయంగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ ఈ పవర్ ఫుల్ డ్యాన్స్ నంబర్‌ను ఆలపించడం. సాధారణంగా మెలోడీలకు పెట్టింది పేరైన రెహ్మాన్, ఈసారి మాస్ పల్స్ పట్టే బీట్స్‌తో అదిరిపోయే ఎనర్జీని అందించారు. 'రై రై రా రా' వింటుంటేనే బాడీలో వైబ్రేషన్స్ మొదలయ్యేలా ఇన్‌ఫెక్షియస్ రిథమ్‌ను సెట్ చేశారు.
రామ్ చరణ్(Ram Charan) గ్రేస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.తన ట్రేడ్‌మార్క్ మాస్ ఎనర్జీతో చరణ్ డ్యాన్స్ ఫ్లోర్‌ను షేక్ చేశారు.ఆయన పాదరసం లాంటి మూవ్‌మెంట్స్, పవర్‌ఫుల్ ఫుట్‌వర్క్ చూస్తుంటే థియేటర్లలో సీట్లు మిగలవనిపిస్తోంది.జానీ మాస్టర్ అందించిన డైనమిక్ కొరియోగ్రఫీ, చరణ్ కరిస్మాటిక్ ఎక్స్‌ప్రెషన్స్ తోడవ్వడంతో ఈ పాట ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.
వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక ఎపిక్ స్కేల్‌లో రూపుదిద్దుకుంటోంది. బుచ్చిబాబు సానా తనదైన శైలిలో రామ్ చరణ్‌ను మునుపెన్నడూ చూడని విధంగా ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో గ్లామరస్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండటం మరో విశేషం. వీరిద్దరి జంట వెండితెరపై ఒక ఫ్రెష్ ఫీల్‌ను ఇవ్వబోతోంది.
కేవలం లీడ్ పెయిర్ మాత్రమే కాదు, ఈ సినిమాలో దిగ్గజ నటుల సందడి ఉండబోతోంది.కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో మెరవనున్నారు.జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి పవర్‌హౌస్ పెర్ఫార్మర్స్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం సినిమా రేంజ్‌ను పెంచేసింది.
సమ్మర్ హీట్‌ను మరింత పెంచుతూ ఏప్రిల్ 30న 'పెద్ది' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. 'చికిరి చికిరి' క్లాస్ ప్లస్ మాస్ టచ్ ఇస్తే, 'రై రై రా రా' ప్యూర్ మాస్ సెలబ్రేషన్ లా ఉంది. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి మెగా పవర్ స్టార్ వస్తున్నారనే సంకేతాలు ఈ పాటతో స్పష్టమయ్యాయి.మెగా అభిమానులారా.. గెట్ రెడీ. రామ్ చరణ్ మాస్ జాతర మొదలైపోయింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




