
Peddi: బాబాయ్ కోసం అబ్బాయ్ త్యాగం..పెద్ది సినిమా విడుదల వాయిదా..ఎప్పుడంటే?
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మధ్య ఉన్న బాబాయ్-అబ్బాయ్ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మధ్య ఉన్న బాబాయ్-అబ్బాయ్ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా రామ్ చరణ్ తీసుకున్న ఒక నిర్ణయం మెగా అభిమానుల మనసు గెలుచుకోవడమే కాకుండా, బాబాయ్ పట్ల తనకున్న గౌరవాన్ని చాటిచెప్పింది.
దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది'. వాస్తవానికి ఈ సినిమా చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న విడుదల కావాల్సి ఉంది. అయితే, అదే సమయంలో హరీష్ శంకర్-పవన్ కల్యాణ్ ల క్రేజీ ప్రాజెక్ట్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మార్చి 26న రిలీజ్ కానుంది. ఒకే సమయంలో రెండు భారీ సినిమాలు వస్తే థియేటర్ల సమస్య వస్తుందని, బాబాయ్ సినిమాకు ఇబ్బంది కలగకూడదని రామ్ చరణ్ తన 'పెద్ది' చిత్రాన్ని ఏప్రిల్ 30కి వాయిదా వేసుకున్నారు.
ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం చరణ్ తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకోవడం విశేషం.జాన్వీ కపూర్ 'అచ్చమ్మ' పాత్రలో నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ‘చికిరి చికిరి’ సాంగ్ ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలిచింది. మార్చిలో బాబాయ్ 'ఉస్తాద్'గా విరుచుకుపడితే, ఏప్రిల్ ఆఖరులో అబ్బాయ్ 'పెద్ది'గా బాక్సాఫీస్ వద్ద జాతర చేయనున్నారు. మొత్తానికి మెగా హీరోల నిర్ణయంతో ఈ వేసవిలో అభిమానులకు డబుల్ ధమాకా ఖాయం.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




