Peddi Movie: 'పెద్ది' ఆట మొదలైంది.. రామ్ చరణ్ కెరీర్‌లోనే బిగ్ డీల్‌!

Peddi Movie: పెద్ది ఆట మొదలైంది.. రామ్ చరణ్ కెరీర్‌లోనే బిగ్ డీల్‌!
x

Peddi Movie: 'పెద్ది' ఆట మొదలైంది.. రామ్ చరణ్ కెరీర్‌లోనే బిగ్ డీల్‌!

Highlights

Peddi Movie: గ్లోబల్ మార్కెట్‌పై కన్నేసిన చరణ్.. ‘పెద్ది’తో బాక్సాఫీస్ రికార్డులపై దండయాత్రకు సిద్ధం!

'మెగా పవర్ స్టార్' రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న భారీ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. ‘ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రారంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పెద్ది మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే సుమారు 80 శాతం షూటింగ్ పూర్తి కాగా.. మిగిలిన భాగాన్ని మరో రెండు మూడు వారాల్లో ముగించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి.. అనుకున్న సమయానికి సినిమా విడుదలకు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో పెద్ది బిజినెస్ ఆట మొదలైంది. బిజినెస్ డీల్స్ వేగం పుంజుకున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రానికి భారీ డిమాండ్ ఏర్పడింది. నార్త్ అమెరికా హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్టు తెలిసింది. అక్కడ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. నార్త్ అమెరికాలో పెద్ది బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 మిలియన్ డాలర్లుగా నిర్ణయించగా.. మొత్తం ఓవర్సీస్ రైట్స్ దాదాపు 9.5 మిలియన్ డాలర్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఇది రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యంత పెద్ద డీల్‌గా చెప్పబడుతోంది.

పెద్ది చిత్రాన్ని 2026 ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే విదేశాల్లో మాత్రం ఒక రోజు ముందుగానే.. అంటే ఏప్రిల్ 29న ప్రీమియర్ షోలు వేయాలని నిర్ణయించారు. ఇక మార్చి 2న ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగిల్ విడుదల కానుంది. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్, బుచ్చిబాబు మేకింగ్ స్టైల్.. అన్ని కలిపి పెద్దిపై అంచనాలు భారీగా ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. చరణ్ చివరగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీ డిజాస్టర్ కావడంతో.. పెద్దిపై ఆశలు పెట్టుకున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories