రామ్ చరణ్ అభిమానులకు గుడ్‌న్యూస్..'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత సినిమా ఆయనతో ఫిక్స్‌?

రామ్ చరణ్ అభిమానులకు గుడ్‌న్యూస్..ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత సినిమా ఆయనతో ఫిక్స్‌?
x
రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి ఫైల్ ఫోటో
Highlights

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఓ శుభవార్త అందించనున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా కోసం ఎందరో దర్శకులు ఇప్పటి నుంచే ఆయన వద్దకు క్యూ కడుతున్నారు.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఓ శుభవార్త అందించనున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా కోసం ఎందరో దర్శకులు ఇప్పటి నుంచే ఆయన వద్దకు క్యూ కడుతున్నారు. అయితే కొందరు దర్శకులు రామ్ చరణ్‌కు కథలు చెప్పగా.. మళ్ళీరావా, జేర్సీ చిత్రాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కథకు ఓకే చెప్పినట్లు టాక్. వీరిద్దరు కలిసి ఈ సారి రొమాంటిక్ డ్రామాలో తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇటీవలే దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రామ్‌చరణ్‌ను కలుశాడని తెలుస్తోంది. రామ్ చరణ్ కు కథ చెప్పడాని ఒక తెలుగు వ్యక్తి , పంజాబీ అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథ ఇతి వృతాతం నేపథ్యంలో కథ చెప్పినట్లు సమాచారం. దర్శకుడు గౌతమ్ చెప్పిన కథకు రామ్ చరణ్ ఫిదా అయ్యాడని, ఆయన కథ విన్న తర్వాత సంతోషం వ్యక్తం చేశారని సంమాచారం. గౌతమ్ కథకు ఓకే చెప్పారని తెలుస్తోంది. గౌతమ్ మూడు కథలు చరణ్‌కు గౌతమ్ వినిపించాడట. అయితే మూడూ బాగున్నాయని, వాటిలో ఓ కథకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది.

రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఈ చిత్రంతో షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. 2021 జనవరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో మూవీ తెరకెక్కుతోన్న సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది.

నేచురల్ స్టార్ జెర్సీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు గౌతమ్ తిన్ననూరి. ప్రస్తుతం జెర్సీ సినిమా హిందీ వర్షన్ రీమేక్‌లో బీజీగా ఉన్నారు. షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తు ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో ఈ చిత్రం పూర్తి అయినా తర్వాత రామ్ చరణ్ తో సినిమాను ప్రారంభించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories