ఆ షరతు తోనే రీమేక్ సినిమాలు చేస్తాను అంటున్న రామ్ చరణ్

* ఈ మధ్యకాలంలో చాలావరకు ప్రేక్షకులు ఓటీటీలోనే సినిమాలు చూస్తూ ఉండటం వల్ల రీమేక్ సినిమాల కలెక్షన్లలో కొంత భాగం తగ్గుతుందని అన్నారు చరణ్.

R Tripura Malini
Updated on: 30 Nov 2022 9:00 PM IST
ram charan says that he will do remake movies only on that condition
X

ఆ షరతు తోనే రీమిక్ సినిమాలు చేస్తాను అంటున్న రామ్ చరణ్

Ram Charan: ఈ మధ్యకాలంలో మెగా హీరోలలో చాలామంది రీమేక్ సినిమాలో చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ దాదాపు వేరే భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను ఈ మధ్య రీమేక్ లు చేస్తున్నారు. ఇటీవల చిరు నటించిన ఖైదీ నెంబర్ 150, గాడ్ ఫాదర్, పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్, వకీల్ సాబ్ వంటి సినిమాలు రీమేక్ సినిమాలే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీమేక్ సినిమాల గురించి మాట్లాడారు.

ఈ మధ్యకాలంలో చాలావరకు ప్రేక్షకులు ఓటీటీలోనే సినిమాలు చూస్తూ ఉండటం వల్ల రీమేక్ సినిమాలను థియేటర్లో చూడడానికి అంత ఆసక్తి చూపించడం లేదని, రీమేక్ సినిమాల వల్ల కలెక్షన్లలో కొంత భాగం తగ్గుతుందని అన్నారు చరణ్. ఒకవేళ తను గనుక రీమేక్ సినిమాలో నటించాలంటే ముందుగా ఒరిజినల్ సినిమా నిర్మాతని ఓటీటీలలో విడుదల చేయొద్దని కోరతానని ఆ నిర్మాత ఒప్పుకుంటేనే ఆ సినిమాని రీమేక్ చేస్తానని లేదా ఒరిజినల్ స్క్రిప్ట్ లకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చారు రామ్ చరణ్.

ఇక ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్ చరణ్ తాజాగా ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో #ఆర్సి15 అనే సినిమాతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ బ్యూటీ కీయారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి, జయరాం, ఎస్ జే సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ "ఉప్పెన" ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story