Top
logo

'మా' వివాదంపై స్పందించిన మెగా పవర్ స్టార్

X
Highlights

ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ (మా)లో విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ (మా)లో విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ వివాదాలపైన హీరో రామ్ చరణ్ స్పందించారు. ఈ రోజు విజయవాడలోని బందర్ రోడ్డులో ఏర్పాటు చేసిన హ్యాపీ మొబైల్ స్టోర్‌ను రామ్ చరణ్ ప్రారంభించారు. రామ్ చరణ్ వస్తున్న సంగతి తెలుసుకున్న అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్ మీడియాతో ముచ్చటించారు. ఈ నేపధ్యంలో ఓ విలేకరి మా వివాదం పైన ప్రశ్నించాడు.

అయితే దీనిపైన రామ్ చరణ్ స్పందిస్తూ.. " ఆ వివాదాలు వాళ్లే పరిష్కరించుకుంటారు. సినీరంగంలో జరుగుతున్న పరిణామాలను పెద్దలు చూసుకుంటారు'' అని చెప్పుకొచ్చారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి వెళ్లడంపై రామ్ చరణ్ స్పందిస్తూ.. సూపర్‌స్టార్ మూవీకి మెగాస్టార్ లాంటి వ్యక్తి వెళ్ళడం మంచి పరిణామం. తక్కువ సమయంలో సినిమా షూటింగ్‌లు పూర్తి చేయడం వల్ల నిర్మాతలకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది" అని చెప్పుకొచ్చారు.

ఇక తానూ చేస్తున్న RRR మూవీ విడుదల తేదిపైన రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే వీటిపైనా రామ్ చరణ్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు.. RRR షూటింగ్ 65 శాతం అయిందని , సినిమా అనుకున్న సమయానికే జులై 30 న రిలీజ్ అవుతుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఇందులో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు.

ఇక బాలీవుడ్ కి మీరు వెళ్తున్నారా అన్న ప్రశ్నకు రామ్ చరణ్ స్పందిస్తూ.. " అక్కడ ఉన్నవాళ్లే ఇక్కడికి వస్తుంటే మనం అక్కడికి ఎందుకు? ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ల హవా నడుస్తుంది, ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని రామ్ చరణ్ తెలిపాడు. ఇక ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలు అన్నింటికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇక చివరగా హ్యాపీ మొబైల్ స్టోర్‌ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం ఆనందంగా ఉందని అన్నారు.

Web TitleRam charan responds about maa dispute
Next Story