Ram Charan: రామ చరణ్‌ కొత్త సినిమా టైటిల్‌ ఏంటో తెలుసా.? అధికారిక ప్రకటన

Ram Charan RC16 Official Title Announced Peddi First Look Unveiled
x

Ram Charan: రామ చరణ్‌ కొత్త సినిమా టైటిల్‌ ఏంటో తెలుసా.? అధికారిక ప్రకటన

Highlights

Ram Charan: గేమ్‌ ఛేంజర్‌ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో మెగా అభిమానులు నిరుత్సాహపడ్డ విషయం తెలిసిందే.

Ram Charan: గేమ్‌ ఛేంజర్‌ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో మెగా అభిమానులు నిరుత్సాహపడ్డ విషయం తెలిసిందే. అయితే తర్వాత చిత్రంతో ఎలాగైనా అభిమానులకు ట్రీట్‌ ఇవ్వాలని ఫిక్స్‌ అయిన రామ్‌ చరణ్‌, బుచ్చిబాబుతో చేతులు కలిపారు. RC16 వర్కింగ్ టైటిల్‌తో ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించింది.

రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా మూవీ యూనిట్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో చరణ్ లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో సరికొత్త లుక్‌లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఇక ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా స్పోర్ట్స్‌ నేపథ్యంలో రూపొందుతోంది. ‘ఉప్పెన’ తర్వాత దాదాపు రెండేళ్లు కష్టపడి బుచ్చిబాబు ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు.

ఇందులో రామ్ చరణ్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండనుందని సమాచారం. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సంగీతదర్శకుడిగా ఏఆర్ రెహమాన్ పనిచేస్తుండగా, ఇప్పటికే రెండు పాటల్ని పూర్తి చేసినట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్, గ్రాండ్ విజువల్స్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories