చిరంజీవిని చూసుకుంటూ తన కెరీర్ ని పక్కన పెట్టిన రామ్ చరణ్

Ram Charan Put Aside his Career to look After Chiranjeevi
x

చిరంజీవిని చూసుకుంటూ తన కెరీర్ ని పక్కన పెట్టిన రామ్ చరణ్

Highlights

*చిరు సంగతి సరే కానీ చరణ్ సంగతి ఏంటి అని అడుగుతున్న అభిమానులు

Tollywood: ఒక దశాబ్ద కాలం పాటు సినిమాలకి దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యనే "ఖైదీ నెంబర్ 150" సినిమాతో మళ్లీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. చిరు రీ ఎంట్రి తర్వాత నుంచి తాను చేసే సినిమాలకు రామ్ చరణ్ స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక "ఆచార్య" సినిమా ఫెయిల్యూర్ తర్వాత చిరంజీవి కరియర్ విషయంలో రామ్ చరణ్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. "గాడ్ ఫాదర్" సినిమా కోసం కూడా స్వయంగా రామ్ చరణ్ చిరంజీవిని ఒప్పించారట. ఈ విషయం చిరంజీవి స్వయంగా చెప్పుకొచ్చారు. "లుసిఫర్" బాగా నచ్చడంతో ఆ సినిమా రైట్స్ కొనుక్కుంటున్నానని రామ్ చరణ్ చెప్పిన తర్వాతే చిరంజీవి ఆ సినిమాని చూశారట.

సినిమా తనకి కూడా నచ్చడంతో రీమేక్ చేయడానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు "గాడ్ ఫాదర్" సినిమా మంచి హిట్ అయింది. తాజాగా మమ్ముట్టి నటించిన "భీష్మ పర్వం" సినిమా చూసిన చిరంజీవి ఆ సినిమాని కూడా రీమేక్ చేయాలని అనుకోగా రామ్ చరణ్ కూడా అందుకు ఒప్పుకున్నారు. చిరంజీవి కెరీర్ బాగానే ఉన్నప్పటికీ రామ్ చరణ్ తన కెరియర్ విషయంలో కొంత అజాగ్రత్తగా ఉంటున్నాడని అభిమానులు అంటున్నారు. "ఆర్ఆర్ఆర్" సినిమాతో మంచి హిట్ అందుకున్న రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం మరొక సినిమాకి సైన్ చేయలేదు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయాల్సిన సినిమాని కూడా క్యాన్సిల్ చేశారు. ఇక చిరంజీవి కెరీర్ బాగానే నడిపిస్తున్న రామ్ చరణ్ తన కెరీర్ ను పక్కకు పెట్టేస్తున్నారని మెగా అభిమానులు కంగారు పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories