శంకర్ సినిమాని వాయిదా వేసిన రామ్ చరణ్...

Ram Charan Postponed Shankar Movie | Tollywood Gossips
x

శంకర్ సినిమాని వాయిదా వేసిన రామ్ చరణ్...

Highlights

Ram Charan: ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో రికార్డు స్థాయిలో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

Ram Charan: ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో రికార్డు స్థాయిలో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ "ఆచార్య" సినిమాతో మాత్రం పెద్దగా మెప్పించలేకపోయారు. ఇక తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గతంలో ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.

కానీ దీని గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అనుకున్నదానికంటే వేగంగానే షూటింగ్ జరుగుతున్నప్పటికీ నిర్మాణాంతర పనుల కోసం శంకర్ కొంచెం ఎక్కువ సమయం ఇవ్వమని నిర్మాతలను కోరారట. దీంతో రామ్ చరణ్ మరియు దిల్ రాజు కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సినిమా షూటింగ్ కి సంబంధించిన కొన్ని కీలక షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర విభిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మధ్యనే షూటింగ్ నుండి రామ్ చరణ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు లీక్ అయ్యాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories