logo
సినిమా

'సైరా' దర్శకుడికి ఆర్డర్ వేసిన రామ్ చరణ్

సైరా దర్శకుడికి ఆర్డర్ వేసిన రామ్ చరణ్
X
Highlights

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రంపై భారీ...

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రంపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా కాలంగా జరుగుతూనే ఉంది కానీ ఇంకా పూర్తి కాలేదు. మొదట వేసవిలో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని ఆగస్టుకి వాయిదా వేశారు. అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాత రామ్ చరణ్ సురేందర్ రెడ్డి కి డెడ్లైన్ విధించారు అని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ని మే 5 లోపల పూర్తి చేయాలని రామ్ చరణ్ సురేందర్ రెడ్డి కి చెప్పారట.

ఏప్రిల్ 2వ తారీఖు లోపు హైదరాబాదులో కోకాపేటలో జరుగుతున్న ఒక కీలకమైన షెడ్యూల్ పూర్తి కానుంది. ఈ షెడ్యూల్ తర్వాత కొత్త షెడ్యూల్ ఒక వారం పాటు చైనా లేదా మధ్యప్రదేశ్లో జరగనుందట. స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితచరిత్ర గా తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఆగస్టులో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయడం సముచితంగా ఉంటుందని రామ్ చరణ్ ఈ డెడ్ లైన్ ని విధించినట్లు తెలుస్తోంది. అమితాబచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్ కిచ్చా వంటి స్టార్లు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. మరి రాంచరణ్ ఇచ్చిన గడువు లోపల సురేందర్ రెడ్డి సినిమా షూటింగ్ పూర్తి చేస్తారో లేదో చూడాలి.

Next Story