Ram Charan- Upasana: మెగా ఇంట్లో సందడి.. కవలల పేర్లు వెల్లడించిన రామ్ చరణ్.. పేర్లు ఏంటో తెలుసా?


Ram Charan- Upasana: మెగా ఇంట్లో సందడి.. కవలల పేర్లు వెల్లడించిన రామ్ చరణ్.. పేర్లు ఏంటో తెలుసా?
Ram Charan- Upasana Reveal Twin Names: మెగా వారసుల పేర్లు వచ్చేశాయి! రామ్ చరణ్ - ఉపాసన దంపతులు తమ కవల పిల్లలకు 'శివరామ్', 'అన్విరా దేవి' అని నామకరణం చేశారు.
Ram Charan- Upasana Reveal Twin Names: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు తమ కవల పిల్లల పేర్లను అధికారికంగా ప్రకటించారు. జనవరి 31న ఈ దంపతులకు ఒక బాబు, ఒక పాప జన్మించిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చరణ్ తమ చిన్నారుల పేర్లను వెల్లడించి మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.
అత్యంత వైభవంగా బారసాల వేడుక: ఫిబ్రవరి 11న మెగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య చిన్నారుల బారసాల (నామకరణ మహోత్సవం) శాస్త్రోక్తంగా జరిగింది. ఈ వేడుకలో కుటుంబ పెద్దలు చిన్నారులకు పేర్లు ఖరారు చేశారు.
వారసుల పేర్లు ఇవే:
కుమారుడి పేరు: శివరామ్ (Shivram)
కుమార్తె పేరు: అన్విరా దేవి (Anveera Devi)
సంప్రదాయం కలిసొచ్చేలా ఈ పేర్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'శివరామ్', 'అన్విరా దేవి' పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మనవడు, మనవరాలికి నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



