Ram Charan: కలెక్షన్ల విషయంలో మాట తప్పిన రామ్ చరణ్

Ram Charan Missed the Word About the Collection of Films
x

Ram Charan: కలెక్షన్ల విషయంలో మాట తప్పిన రామ్ చరణ్

Highlights

Ram Charan: మాట తప్పిన మెగా పవర్ స్టార్

Ram Charan: సినిమాల కలెక్షన్ల విషయంలో రామ్ చరణ్ తన మాట మీద తానే నిలబడకుండా ఉండటంతో అభిమానులు ఇప్పుడు చెర్రీ ని తెగ ట్రోల్ చేస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన "గాడ్ ఫాదర్" సినిమా అక్టోబర్ 5న విడుదలైంది. రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్, ఆర్బీ చౌదరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కొన్ని నెలల క్రితం 2018లో వాల్ పోస్టర్‌లపై ఫేక్ కలెక్షన్స్ గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ ఒక షాకింగ్ స్టేట్మెంట్ చేశారు. "రంగస్థలం" సినిమా విడుదలై బ్లాక్‌బస్టర్‌గా అయిన సమయంలో మేకర్స్ ఈ సినిమా అసలు గ్రాస్ కలెక్షన్స్ ని వాల్ పోస్టర్స్ మీద ప్రచురించారు.

సినిమా పెద్ద హిట్ కావడంతో కలెక్షన్స్‌పై ఫ్యాన్స్‌కు ఎలాంటి డౌట్లు లేవు. కానీ పోస్టర్లపై కలెక్షన్లు వస్తే అభిమానుల మధ్య గొడవలకు దారి తీస్తుందని రామ్ చరణ్ అన్నారు. అందుకే అలాంటి గొడవలు రాకుండా ఉండేందుకు తన సినిమాలకు కలెక్షన్లతో పోస్టర్లు రాకుండా చూసుకుంటానని మాట ఇచ్చారు రామ్ చరణ్. కానీ ఇది జరిగిన 4 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ తన మాట వెనక్కు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన "గాడ్ ఫాదర్" సినిమా హిట్ టాక్ అందుకుంది. అయితే మెగాస్టార్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఓపెనింగ్ కలెక్షన్స్ రాలేదని ట్రేడ్ వర్గాల సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ అధికారిక అకౌంట్ నుండి ఈ రోజు విడుదలైన పోస్టర్ గ్రాస్ కలెక్షన్ 38 కోట్లు అని ఉంది. కానీ ఒరిజినల్ గ్రాస్ అంతకంటే తక్కువ అని, రామ్ చరణ్ ఫేక్ మరియు ఓవర్ హైప్ చేసిన నంబర్లను పోస్ట్ చేస్తున్నారని కొందరు ట్రోల్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories