రెండు బాలీవుడ్ సినిమాలు సైన్ చేసిన రామ్ చరణ్

Ram Charan Has Signed two Bollywood Films
x

మళ్లీ బాలీవుడ్ లో సినిమా చేయబోతున్న మెగా పవర్ మెగా హీరో

Highlights

Ram Charan: మళ్లీ బాలీవుడ్ లో సినిమా చేయబోతున్న మెగా పవర్ స్టార్

Ram Charan: "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. తెలుగులోనే పలు సినిమాలతో బిజీగా ఉన్న రామ్ చరణ్ కు ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా బోలెడు ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత రామ్ చరణ్ పలు స్టార్ట్ డైరెక్టర్ లతో చేతులు కలపబోతున్నారు అని పుకార్లు వినిపిస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడ లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు రామ్ చరణ్ రెండు బాలీవుడ్ సినిమాలు సైన్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే రామ్ చరణ్ కి ఇది బాలీవుడ్ లో డెబ్యూ మూవీ కాదు. గతంలో కూడా "జంజీర్" కి రీమేక్ అయిన "తూఫాన్" సినిమాలో నటించారు రామ్ చరణ్. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన రామ్ చరణ్ ఈ సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ ను అందుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఒక కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో రామ్ చరణ్ బాలీవుడ్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే రామ్ చరణ్ ఇంకా ఈ సినిమాలకి సైన్ చేయలేదని కేవలం డిస్కషన్లు మాత్రమే జరుగుతున్నాయని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories