అందరు స్టార్ డైరెక్టర్ ల తో చేతులు కలపనున్న ఆర్ రామ్ చరణ్

Ram Charan has Signed Films with Star Directors | Tollywood News
x

అందరు స్టార్ డైరెక్టర్ ల తో చేతులు కలపనున్న ఆర్ రామ్ చరణ్

Highlights

*అందరు స్టార్ డైరెక్టర్ ల తో చేతులు కలపనున్న ఆర్ రామ్ చరణ్

Ram Charan: ఈమధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ తాజాగా స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విక్రమ్ సినిమా సూపర్ హిట్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి కూడా లోకేష్ కనగరాజ్ ను మెచ్చుకుంటూ ఒక ట్వీట్ చేశారు.

ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కోసం స్వయంగా లోకేష్ కనగరాజ్ ని లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. మరో వైపు "కే జి ఎఫ్" ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా రామ్ చరణ్ ఒక సినిమా చేయబోతున్నారు. ఇలా వరుసగా స్టార్ డైరెక్టర్లతో భారీ ప్రాజెక్టులను తన లైన్ లో ఉంచుకున్నారు రామ్ చరణ్. ఈ సినిమాల కోసం అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇలా దాదాపు అందరూ స్టార్ డైరెక్టర్లు రాంచరణ్ తో సినిమాలు చేయబోతున్నారు. తన తదుపరి సినిమాలతో మిగతా స్టార్ హీరోలు కుళ్ళుకునేలా చేస్తున్నారు చెర్రీ. కొందరేమో చిరంజీవి కావాలనే రామ్ చరణ్ కరియర్ కోసం ఇలా స్టార్ డైరెక్టర్ ల ను రంగంలోకి దింపుతున్నట్లు చెబుతుండగా మరి కొందరు మాత్రం రామ్ చరణ్ ఇప్పటికే స్టార్ హీరో అని తన రేంజ్ కి తగ్గట్టుగానే స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories