Ramcharan: "ఆర్‌సీ16" గురించి షాకింగ్ అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్..

RamCharan Gave Shocking Update On RC15
x

"ఆర్ సీ 15" గురించి షాకింగ్ అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్..

Highlights

* రంగస్థలం కంటే పవర్ ఫుల్ పాత్ర చేయబోతున్న రామ్ చరణ్

RamCharan: "ఆర్ ఆర్ ఆర్" సినిమాలోని "నాటు నాటు" పాట ఆస్కార్ అవార్డుని అందుకోవడంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక ప్రపంచం మొత్తం మీద ఈ సినిమాలో హీరోలుగా నటించిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల పేర్లు కూడా మారు మ్రోగి పోతున్నాయి. ఈ నేపథ్యంలో వీరి తదుపరి సినిమాల మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు.

#ఆర్సీ15 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ లో కీయార అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమాని సైన్ చేసిన సంగతి తెలిసిందే. "ఉప్పెన" వంటి సూపర్ హిట్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన బుచ్చిబాబు ఇప్పుడు రామ్ చరణ్ కోసం కూడా ఒక అదిరిపోయే స్క్రిప్ట్ తో వచ్చారట. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ చరణ్ ఈ సినిమా గురించి కొన్ని షాకింగ్ అప్డేట్ లు ఇచ్చారు. ఈ సినిమాలో తన పాత్ర అదిరిపోయేలాగా ఉంటుందట. ఈ సినిమాలో రామ్ చరణ్ ఇంతకుముందు ఎన్నడూ కనిపించనటు వంటి పాత్రలో కనిపించనున్నారట. అంతేకాకుండా "రంగస్థలం" లో తను పోషించిన చిట్టిబాబు పాత్ర కంటే ఈ సినిమా ఇంకా పవర్ఫుల్ గా ఉండబోతుందని చెప్పుకొచ్చారు రామ్ చరణ్. దీంతో రామ్ చరణ్ పాత్ర ఎలా ఉండబోతుందో అని అభిమానుల్లో భారీగానే చర్చ మొదలైంది. ఇక ఈ సినిమా వెస్టర్న్ ఆడియన్స్ కి కూడా బాగా నచ్చుతుందని షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి మొదలవుతుందని అంటున్నారు రామ్ చరణ్.

Show Full Article
Print Article
Next Story
More Stories