విజయ్ దేవరకొండ చేతుల్లోకి వెళ్లిన రామ్ చరణ్ సినిమా

Ram Charan Film in the Hands of Vijay Devarakonda
x

విజయ్ దేవరకొండ చేతుల్లోకి వెళ్లిన రామ్ చరణ్ సినిమా

Highlights

Tollywood: రామ్ చరణ్ వద్దన్న కథను విజయ్ దేవరకొండ ఎంపిక చేశారా?

Tollywood: ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది కానీ ఈ మధ్యనే హిందీలో "జెర్సీ" సినిమాని రీమేక్ చేసిన గౌతమ్ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయారు. దీంతో రామ్ చరణ్ గౌతమ్ తిననూరి దర్శకత్వంలో చేయాల్సిన సినిమాని క్యాన్సిల్ చేసేసారు. అయితే తాజాగా ఇప్పుడు ఆ సినిమా ఒక యువ హీరో చేతుల్లోకి వెళ్లినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

రామ్ చరణ్ కు చెప్పిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కథను గౌతమ్ తిన్ననూరి యువ హీరో విజయ్ దేవరకొండ కి వినిపించారట. మొదటి సిట్టింగ్ లోనే విజయ్ దేవరకొండ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ ఈ మధ్యనే "లైగర్" సినిమాతో కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. ఈ నేపథ్యంలో "గీతగోవిందం" వంటి రొమాంటిక్ కామెడీ సినిమా కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ కి గౌతమ్ తిన్నానూరి సరిగ్గా అలాంటి కదే చెప్పటంతో వెంటనే ఒప్పేసుకున్నారట. అలా రామ్ చరణ్ చేయాల్సిన సినిమా ఇప్పుడు విజయ్ దేవరకొండ చేతిలోకి వెళ్ళింది. మరి ఆ సినిమా విజయ్ దేవరకొండ కి ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories