మళ్లీ రామ్ చరణ్ సినిమాని ఆలస్యం చేస్తున్న శంకర్

Ram Charan Fans are Trolling the Star Director Shankar
x

మళ్లీ రామ్ చరణ్ సినిమాని ఆలస్యం చేస్తున్న శంకర్ 

Highlights

మళ్లీ రామ్ చరణ్ సినిమాని ఆలస్యం చేస్తున్న శంకర్

RC 15: ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ఇప్పుడు శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. #ఆర్సీ15 అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తయింది. కానీ కమల్ హాసన్ హీరోగా "భారతీయుడు 2" సినిమా షూటింగ్ మళ్లీ మొదలుపెట్టే అవకాశం రావడంతో శంకర్ రామ్ చరణ్ సినిమాను పక్కకు పెట్టేసి "భారతీయుడు 2" సినిమా షూటింగ్ ను పట్టాలెక్కించారు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు షాక్ అయిన సంగతి తెలిసిందే.

అయితే సోషల్ మీడియా ద్వారా "భారతీయుడు 2" మరియు రామ్ చరణ్ సినిమా షూటింగులు ఒకేసారి జరుపుకుంటాయని తెలియజేశారు శంకర్. అనుకున్న ప్రకారం అయితే ఇవాల్టి నుండి ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలు అవ్వాలి. కానీ "భారతీయుడు 2" సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న శంకర్ రామ్ చరణ్ సినిమాకి సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో శంకర్ రామ్ చరణ్ సినిమాకి మళ్లీ బ్రేకులు వేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు ఇప్పుడు శంకర్ పై సోషల్ మీడియాలో మళ్లీ ట్రోలింగ్ మొదలుపెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories