ఆచార్య లో తనకి బాగా నచ్చిన సన్నివేశం అదే అంటున్న రామ్ చరణ్...

Ram Charan Explained about His Favorite Scene in Acharya Movie | Megastar Chiranjeevi | Tollywood Gossips
x

ఆచార్య లో తనకి బాగా నచ్చిన సన్నివేశం అదే అంటున్న రామ్ చరణ్...

Highlights

Ram Charan: చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది...

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని నిర్మించిన రామ్ చరణ్ సినిమాలో సిద్ధ అనే పాత్రలో కూడా కనిపించబోతున్నారు. రామ్ చరణ్ మరియు మెగాస్టార్ లను చిరంజీవిలను వెండితెరపై చూడడానికి మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ప్రస్తుతం ఈ చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ చరణ్ సినిమాలో తనకి నచ్చిన సన్నివేశం గురించి చెప్పుకొచ్చారు. "ఆ రోజు చివరి సన్నివేశంలో నటించమని కొరటాల శివ అడిగినప్పుడు మొదట మేము చిరుత పులి ని చూడలేదు" అని చెప్పిన రామ్ చరణ్ అది తనకి మరియు మెగా స్టార్ కి మధ్య జరిగిన మోంటేజ్ షార్ట్ అని అనుకున్నారట.

కానీ తరువాత శివ క్యాప్చర్ చేశాక షాట్ గురించి వివరించి నప్పుడు తను ఆశ్చర్య పోయినట్లుగా తెలిపారు రామ్ చరణ్. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించి నటిస్తోంది. సోను సూద్ ఈ సినిమాలో ముఖ్య విలన్ గా కనిపించనున్నారు. యాక్షన్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories