ఆ సినిమాలో నటించి ఉంటే బాగుండేది : రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh
x
Rakul Preet Singh
Highlights

విజయ్ దేవరకొండ హీరోగా కన్నడ బూటీ కథానాయికగా పరుశురాం దర్శకత్వంలో తెలుగులో తెరకెక్కిన చిత్రం గీత గోవిందం. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్...

విజయ్ దేవరకొండ హీరోగా కన్నడ బూటీ కథానాయికగా పరుశురాం దర్శకత్వంలో తెలుగులో తెరకెక్కిన చిత్రం గీత గోవిందం. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్ లో మరో బంపర్ హిట్ చిత్రం ఇది. బాక్సాఫ్స్ ముందు వంద కోట్లుపైగా కలెక్షన్లు కురిపించింది. ఈ చిత్రంలో హిరోయిన్‌గా నటించిన అందాల భామ రష్మిక నటన ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు రాబట్టింది. ఈ చిత్రంలో మందానా కుర్రాల మనసులను దోచుకోంది. అంతేకాదు ప్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించింది. గీత గోవిదం తర్వాత రష్మిక వెనుదిరిగి చూసుకోలేదు. వరస హిట్లతో దూసుకుపోతుంది.

అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు రష్మిక మందాన కంటే ముందుగా టాలీవుడ్ అగ్ర కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్‌ను సంప్రదించారంట దర్శకుడు. ఈ విషయాన్ని రకుల్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ముఖాముఖి కార్యక్రంలో తెలిపింది. ఈ చిత్ర దర్శకుడు పరుశురాం రకుల్‌ను సంప్రదించినప్పుడు ఆమె హిందీ సినిమా దేదే ప్యార్ దే చిత్రానికి తన కాల్షీట్స్ ఇచ్చినట్లు తెలిపింది. అందుకే పరుశురాం ఆఫర్‌ను తిరస్కరించినట్లు రకుల్ వెల్లడించింది. అయితే గీత గోవిదం సినిమాలో నటించి ఉంటే బాగుండేదని..కానీ సినిమా కోల్పోయినందుకు బాధపడడం లేదని రకుల్ చెప్పారు. రకుల్ ప్రీత్ సింగ్ గీత గోవిందం సినిమాలో నటించినట్లుంటే తన సినీ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ ఖాతాలో వేసుకుని ఉండేది.

Show Full Article
Print Article
Next Story
More Stories