logo

ఓల్డ్ అయినా యంగ్ అయినా ప్రేమించడానికి రెడి అంటున్న హీరోయిన్

ఓల్డ్ అయినా యంగ్ అయినా ప్రేమించడానికి రెడి అంటున్న హీరోయిన్
Highlights

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అని అనిపించుకుని, గత కొంతకాలంగా కోలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి నటిస్తున్న రకుల్...

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అని అనిపించుకుని, గత కొంతకాలంగా కోలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ వరుస డిజాస్టర్ల తో సతమతమవుతోంది. ఈమె నటించిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ఈ సమయంలో మళ్ళీ ఆమెకు అవకాశం ఇచ్చింది టాలీవుడ్. ప్రస్తుతం తెలుగులో నాగార్జున తో 'మన్మధుడు 2' సినిమాలో నటిస్తున్న ఈమె హిందీలో 'దే దే ప్యార్ దే' చిత్రంలో అజయ్ దేవగన్ సరసన నటించింది. ఆ చిత్రంలో 50 ఏళ్ల హీరోకు లవర్ గా రకుల్ కనిపించింది.

'దే దే ప్యార్ దే' చిత్రంలో హీరో అజయ్ దేవగన్ భార్య టబు నుండి విడిపోయి లేటు వయసులో రకుల్ ప్రీత్ తో ప్రేమలో పడతాడు. పాతికేళ్ల వయసు తేడా ఉన్న అమ్మాయితో రొమాన్స్ వల్ల హీరో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేదే సినిమా కథ. ఈ మధ్యనే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటి వరకు తాను ప్రేమలో పడలేదని, మంచి వ్యక్తితో ప్రేమలో పడాలని ఉందని చెప్పుకొచ్చింది. సినిమా లాగానే రియల్ లైఫ్ లో కూడా ఏజ్ ఎక్కువ ఉన్న వ్యక్తి అయినా పర్లేదా అని అడిగితే, "నాకు నచ్చిన వ్యక్తి ఓల్డ్ అయినా యంగ్ అయినా వయసుతో సంబంధం లేకుండా ప్రేమిస్తాను. లవ్ కు ఏజ్ తో సంబంధం లేదు" అని స్టేట్మెంట్ ఇచ్చింది ఈ భామ.


లైవ్ టీవి


Share it
Top