తెలుగు సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్

Rakul Preet Singh Gave Clarity About Telugu Cinema
x

తెలుగు సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్

Highlights

Rakul Preet Singh: అప్పుడే తెలుగు సినిమా చేస్తాను అంటున్న రకుల్ ప్రీత్

Rakul Preet Singh: ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ గత కొంతకాలంగా తెలుగు సినిమాలకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆఖరి సారిగా ఈమె 2021 లో వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో విడుదలైన "కొండపొలం" అనే సినిమాలో నటించింది. గత కొంతకాలంగా ఈమె కేవలం బాలీవుడ్ సినిమాలపై మాత్రమే ఎక్కువగా దృష్టి పెడుతోంది. ఇప్పటికే పలు స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని అందుకున్న రకుల్ ప్రీత్ తెలుగులో కూడా చాలామంది స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించింది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా మంచి ముద్ర వేయించుకున్న రకుల్ ఇప్పుడు హిందీ సినిమాల లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

అయితే రకుల్ ప్రీత్ అభిమానులు అందరూ ఈమె మళ్లీ ఎప్పుడు తెలుగులో కనిపించనుంది అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీని గురించి ఓపెన్ అప్ అయింది రకుల్ ప్రీత్. "చాలామంది ఇప్పటికే ఈ ప్రశ్న అడిగారు. కానీ నేను మాత్రం తెలుగు సినిమా చేయలేకపోతున్నాను. నాకు నా తెలుగు అభిమానులు అంటే చాలా ఇష్టం. ఈరోజు నేను ఇలా ఉండటానికి గల కారణం కూడా తెలుగు ప్రేక్షకుల అభిమానమే. తెలుగు చిత్ర పరిశ్రమ వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. కాబట్టి వచ్చే సంవత్సరం నేను తెలుగు సినిమాలో నటించే అవకాశం ఉందని అనుకుంటున్నాను," అని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్. ఇక ప్రస్తుతం హిందీలో రకుల్ ప్రీత్ సింగ్ "డాక్టర్ జి" అనే సినిమాలో నటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories