Top
logo

మాల్దీవుల్లో సెలవుల్ని ఎంజాయ్ చేస్తున్న మిల్కీ బ్యూటీ రకుల్!

మాల్దీవుల్లో సెలవుల్ని ఎంజాయ్ చేస్తున్న మిల్కీ బ్యూటీ రకుల్!
X
Highlights

* మధుర క్షణాలను తన ఫాలోవర్స్‌తో పంచుకుంటున్న బ్యూటీ * మాల్దీవుల టూర్‌ తర్వాత షూటింగ్‌లతో బిజీ కానున్న రకుల్ * బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ * తెలుగులో క్రిష్ డైరెక్షన్‌లో మూవీ చేస్తున్నరకుల్

రకుల్ ప్రీత్.. ఒకవైపు టాలీవుడ్‌, మరోవైపు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న రకుల్.. తాజాగా మాల్దీవుల్లో సెలవుల్ని ఎంజాయ్ చేయడానికి వెళ్లింది. ఫ్యామిలీతో అక్కడికి వెళ్లిన రకుల్.. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీతో గడిపిన మధుర క్షణాలను తన ఫాలోవర్స్‌తో పంచుకుంటుంది.

సెలవుల్ని ఎంజాయ్‌ చేసి తిరిగి వచ్చిన తర్వాత రకుల్ పలు చిత్రాల్లో నటించనుంది. తెలుగులో క్రిష్ డైరెక్షన్‌లో పంజా వైష్ణవ్ తేజ్ జోడీగా ఓ సినిమా చేస్తున్న రకుల్‌, బాలీవుడ్‌లో అర్జున్ కపూర్‌, జాన్ అబ్రహాం, అదితి రావ్ హైదరితో పాటు ఇంకా టైటిల్ ఖరారు చేయని ఓ క్రాస్ బోర్డర్ లవ్ స్టోరీలో నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు తాజాగా అజయ్ దేవ్‌గణ్ డైరెక్ట్ చేయనున్న 'మేడే' మూవీలో ఆయన సరసన హీరోయిన్‌గా ఎంపికైంది. 'మేడే'లో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలతో పాటు తెలుగులో రకుల్ నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటీ దర్శకత్వంలో వస్తోన్న చెక్‌లో ఓ హీరోయిన్‌గా చేస్తోంది.

Web TitleRakul Preet Singh enjoying holidays in Maldives photos shared on Instagram became viral
Next Story