దర్శకుడు రమేష్ వర్మకు అదిరిపోయే బహుమతి‌ ఇచ్చిన నిర్మాత

దర్శకుడు రమేష్ వర్మకు అదిరిపోయే బహుమతి‌ ఇచ్చిన నిర్మాత
x
Highlights

దర్శకుడు రమేష్ వర్మకు ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు నిర్మాత సత్యనారాయణ కోనేరు

దర్శకుడు రమేష్ వర్మకు ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు నిర్మాత సత్యనారాయణ కోనేరు. నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుగా సాయిశ్రీనివాస్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన తన ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మొదటి సినిమా నుంచి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ.. ఊహించిన స్థాయిలో విజయం వరించలేదు. ఈ క్రమంలో శ్రీనివాస్ హీరోగా నటించిన రమేష్ వర్మ దర్శకత్వంలో తమిళ చిత్రం రాచ్చసన్ కు రీమేక్ వచ్చిన క్రైమ్ థ్రిల్లర్‌ "రాక్షసుడు". ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ తన పాత్రకు న్యాయం చేశారు. పోలీసు అధికారిగా చక్కగా సరిపోయారు. జిబ్రన్ దీనికి అద్భుతమైన ఆర్ఆర్ అందించారు. కథ, స్క్రీన్ ప్లే రామ్ కుమార్ తెరపై ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిర్మాణ విలువలను సినిమాను చూసినవారంతా మెచ్చుకుంటారు. చిత్ర నిర్మాణ విషయంలో సత్యనారాయణ కోనేరు ఎక్కడా రాజీపడలేదు.

కాగా.. రాక్షసుడు డైరెక్టర్ రమేష్ వర్మకు సత్యనారాయణ కోనేరు ఓ బహుమతి ఇచ్చారు. ఈ సక్సెస్‌ని పురస్కరించుకుని చిత్ర నిర్మాత కోనేరు సత్యనారాయణ దర్శకుడు రమేష్ వర్మకు ఓ అపురూపమైన బహుమతి అందించారు. డైరెక్టర్ రమేష్ వర్మకు నిర్మాత అందించిన గిఫ్ట్ ఎంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. జూబ్లీహిల్స్‌లోని అయ్యన్న పెరల్‌లో రూ. 3 కోట్ల విలువైన ఫ్లాట్‌ను బహుమతి‌గా ఇచ్చారు. దర్శకుడు రమేష్ వర్మ ఆనందంలో ఉబ్బితబ్బిపోతున్నారు. ఇక ఈ చిత్రంలో సాయిశ్రీనివాస్ జోడిగా అనుపమ పరమేశ్వర్ నటించారు. రాజీవ్ కనకాల, లక్ష్మి, బేబీ దివా, శరవణ పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories