Rajinikanth: పవన్ కల్యాణ్‌ పొలిటికల్ తుఫాన్.. సూపర్ స్టార్‌ స్పెషల్ ట్వీట్

Rajinikanth: పవన్ కల్యాణ్‌ పొలిటికల్ తుఫాన్.. సూపర్ స్టార్‌ స్పెషల్ ట్వీట్
x

Rajinikanth: పవన్ కల్యాణ్‌ పొలిటికల్ తుఫాన్.. సూపర్ స్టార్‌ స్పెషల్ ట్వీట్

Highlights

సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా అనేక మంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక ట్వీట్‌ చేస్తూ రజినీకి విషెస్ తెలిపారు.

సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా అనేక మంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక ట్వీట్‌ చేస్తూ రజినీకి విషెస్ తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌పై రజినీకాంత్ స్పందిస్తూ – “నా సోదరుడు, పొలిటికల్ తుఫాన్ పవన్‌ కల్యాణ్‌ చెప్పిన మాటలు నన్ను ఉప్పొంగించాయి. మీ స్నేహం, గౌరవానికి ధన్యవాదాలు” అంటూ రిప్లై ఇచ్చారు.

రజినీ స్పందనపై పవన్‌ మరోసారి ట్వీట్ చేస్తూ – “మై డియర్ బిగ్ బ్రదర్.. మీ మాటలు నా హృదయాన్ని తాకాయి. మీ ప్రేమ, ఆశీస్సులకు థాంక్స్. మీకు మరిన్ని విజయాలు రావాలని కోరుకుంటున్నా” అన్నారు.

ఇలా ఇద్దరు బిగ్‌ స్టార్స్ మధ్య ట్వీట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు కూడా ఈ సంభాషణను చూసి తెగ సంబరపడుతున్నారు.

ఇక రజినీకాంత్ తాజాగా విడుదలైన ‘కూలీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్నా, రజినీ కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్‌ సాధించింది. త్వరలోనే వరుసగా కొత్త ప్రాజెక్టులు చేయడానికి సిద్ధమవుతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories