అ ఒక్క పాత్రలో నటించాలని ఉంది : రజీనీకాంత్

అ ఒక్క పాత్రలో నటించాలని ఉంది : రజీనీకాంత్
x
Rajinikanth
Highlights

ప్రపంచ వ్యాప్తంగా సూపర్ స్టార్ రజీనీకాంత్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చాలా సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు

ప్రపంచ వ్యాప్తంగా సూపర్ స్టార్ రజీనీకాంత్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చాలా సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు రజీనీ.. ఇప్పటికి సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకి పోటీగా నిలుస్తున్నాడు.. చేసిన సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించిన రజినీకి మాత్రం ఓ పాత్ర మాత్రం ఇంతవరకు చేయలేదని, ఆ పాత్రలో నటించాలని ఉందని చెప్పుకొచ్చాడు రజినీ.. అదే ట్రాన్స్ జెండర్ పాత్ర.. ఆ పాత్రలో నటించాలనుందని రజినీ తాజాగా చెప్పుకొచ్చాడు. దీనితో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. ఓ స్టార్ హీరో అలాంటి పాత్రను చేసేందుకు సిద్దపడడం నిజంగా చాలా గ్రేట్ అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

ప్రస్తుతం రజినీకాంత్ దర్బార్‌ అనే సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా చిత్ర ట్రైలర్‌ ను విడుదల చేశారు. ఈ సినిమాకి ఇండియన్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. ఇందులో రజినీ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాని జనవరి 9న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమానే కాకుండా ఖైది సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తన 161 వ సినిమాని మొదలుపెట్టాడు రజినీ.. రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాని ఆఫీషియల్ గా స్టార్ట్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories