ఆ పాత్రలో నటించాలని ఉంది..మనసులో మాట బయట పెట్టిన రజనీ

ఆ పాత్రలో నటించాలని ఉంది..మనసులో మాట బయట పెట్టిన రజనీ
x
Rajini kanth File Photo
Highlights

సూపర్ స్టార్ రజనీకాంత్ తన మనస్సులోని మాట బయటపెట్టారు. తన సినీ జీవితంలో ఓ పాత్ర మిగిలిపోయిందని తెలిపారు.

దక్షిణాది చలనచిత్ర పరిశ్రమ సూపర్ స్టార్ రజనీకాంత్ తన మనస్సులోని మాట బయటపెట్టారు. తన సినీ జీవితంలో ఓ పాత్ర మిగిలిపోయిందని తెలిపారు. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం దర్భార్ తెలుగు, తమిళం, తోపాటు పలు భాషల్లో విడుదలవుతోంది. కాగా, తాజాగా ఈ చిత్ర టైలర్ ముంబైలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా రజినీకాంత్‌ను జీవితంలో చేయాల్సిన పాత్రలు ఏమైనా ఉన్నాయా అని అడగ్గా.. తాను సినీ ఇండస్ట్రీకి వచ్చి 45 ఏళ్లు గడిచిపోయాయని, ఈ 45ఏళ్లో 160 సినిమాల్లో నటించాన్నారు. అయితే ఇప్పటి వరకూ ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో చేయలేదు. ఆ పాత్ర కూడా వేయాలని ఉంది. అని రజనీకాంత్ తన కోరికను వెల్లడించారు. దర్శకులు ఎవరైనా హిజ్రా పాత్రకు మిమ్మల్ని సంప్రదించారా? పలువురు విలేఖర్లు అని ప్రశ్నించగా .. ఇప్పటి వరకూ ఏ దర్శకుడు ట్రాన్స్ జెండర్ పాత్ర చేయమని తనని సంప్రదించలేదన్నారు. కేవలం తన మనస్సులోని మాటను మీ ముందు వ్యక్త పరుస్తున్నానని స్పష్టం చేశారు.

45 ‎ఏళ్ల సినీ ప్రస్థానంలో మరాఠి సినిమాలలో నటించాలని కోరిక ఉందని, కొన్ని కారణాల అవకాశం వచ్చిన కుదరలేదని తెలిపారు. అవకాశం వస్తే మరాఠి చిత్రాల్లో నటిస్తానని‎ తెలిపారు. దర్బార్‌ సినిమా గురించి రజనీ మాట్లాడారు.. సిరీస్ పోలీస్ అధికారి పాత్రల కంటే కామెడీ పండిస్తూ చేసే పోలీస్ పాత్రలంటే చాలా ఇష్టమని చెప్పారు. ఈ సినిమాలో భిన్నమైన పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తాని, దర్శకుడు మురుగదాస్ ఈ సినిమాలో డిఫరెంట్ సబ్జట్ తో తనను సంప్రదించారని, కథ వినగానే ఓకే చెప్పేశానని రజనీ పేర్కొన్నారు. దర్భర్ చిత్రంలో బెంగళూరు నివాసం ఉండే మరాఠి కుటుంబం ముంబై వచ్చి పోలీస్ కమిషనర్ గా ఎదిగిన వ్యక్తి పాత్రలో నటిస్తున్నాట్లు తెలిపారు.

దర్బర్ చిత్రం షూటింగ్ సందర్భంగా ముంబైలోనే మూడు నెలలు గడిపానని ఈ క్రమంలో ఇక్కడ పరిస్థితులకు అలావాటు పడ్డానని రజనీ అన్నారు. ముంబై ప్రజలు తనకు బాగా నచ్చారని రజనీ కాంత్ పేర్కొన్నారు. దర్బర్ చిత్రంలో రజనీకాంత్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. దాదాపు పాతికేళ్ళ తరువాత పోలీసు డ్రస్సు వేశారు రజనీకాంత్. ఇక ఆ డ్రస్సులో అయన చేసిన విన్యాసాలకు ఇప్పుడు సోషల్ మీడియా ఊగిపోతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories