ఇవాళ పార్టీ కార్యకర్తలతో రజినీ సమావేశం!

ఇవాళ పార్టీ కార్యకర్తలతో రజినీ సమావేశం!
x
Highlights

తన పార్టీకి చెందిన జిల్లా కార్యదర్శులతో ఇవాళ రజనీకాంత్‌ సమావేశం కాబోతున్నారు. మరికొన్ని నెలల్లో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే అంశాన్ని వారితో చర్చించి డిసైడ్‌ చేయనున్నారు

రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలి.. ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలి.. దశాబ్దాలుగా రజనీ మక్కళ్‌ మండ్రం పార్టీ అధినేత రజనీకాంత్‌ కంటున్న కల ఇది. మరి రాబోయే తమిళనాడు ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా..? అసలు ఆయన రాజకీయాల్లోకి వస్తారా.. రారా..? అనే ప్రశ్నకి ఆయన అభిమానులకు ఇవాళ సమాధానం దొరికే అవకాశం ఉంది.

తన పార్టీకి చెందిన జిల్లా కార్యదర్శులతో ఇవాళ రజనీకాంత్‌ సమావేశం కాబోతున్నారు. మరికొన్ని నెలల్లో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే అంశాన్ని వారితో చర్చించి డిసైడ్‌ చేయనున్నారు. అంతకంటే ముందు తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టాలా వద్దా అనే విషయాన్ని కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఇక రజనీకి సంబంధించి గత నెల సోషల్‌ మీడియాలో ఓ లేఖ తీవ్ర గందరగోళం సృష్టించింది. ఆలేఖలో రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశం మరింత ఆలస్యం అవుతుందని.. ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవచ్చని, ఈ కరోనా పరిస్థితుల్లో రజనీకాంత్‌ ప్రజల్లోకి రావడం ప్రమాదకరమంటూ ఉంది. దీనిపై వెంటనే స్పందించిన రజనీకాంత్‌, ఆలేఖకు తనకు సంబంధం లేదని ప్రకటిస్తూనే.. లేఖలో ఉన్నట్లు వైద్యుల సలహా మాత్రం నిజమేనని అంగీకరించారు.

ఈ నేపథ్యంలోనే రజనీ ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నారా..? లేదా..? అనే విషయంపై ఇవాళ ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయాలని రజనీకాంత్‌ నిర్ణయించుకుంటే మాత్రం దానికి సంబంధించిన పూర్తి విధివిధానాల్ని ఆయన పుట్టినరోజు డిసెంబర్‌ 12న ప్రకటించే అవకాశం లేకపోలేదు.

ఇక అసలు విషయానికొస్తే.. ఇద్దరు రాజకీయ ఉద్దండులు జయలలిత, కరుణానిధి మరణించిన తర్వాత తమిళనాట రాజకీయ శూన్యత ఏర్పడింది. ఇప్పుడున్న డీఎంకే, అన్నాడీఎంకే నేతలు ఆ విషయాన్ని కొట్టిపారేస్తున్నప్పటికీ.. ప్రజలు, రాజకీయ విశ్లేషకుల్లో ఇదే అభిప్రాయం ఉంది. అంతేకాదు.. ఆగ్యాప్‌ను భర్తీ చేసే సామర్థ్యం, అవకాశం రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌కు మాత్రమే ఉందనేది వినిపిస్తున్న మాట. మరోవైపు తమిళనాట ఉన్న రాజకీయ శూన్యతను రజనీ సహాయంతో భర్తీ చేసేందుకు బీజేపీ కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories