Rajinikanth : లోకేష్ సహా చాలా మంది డైరెక్టర్లు ఉపేంద్ర నుంచి నేర్చుకోవాలి.. రజనీకాంత్ ప్రశంసలు

Rajinikanth : లోకేష్  సహా చాలా మంది డైరెక్టర్లు ఉపేంద్ర నుంచి నేర్చుకోవాలి.. రజనీకాంత్ ప్రశంసలు
x

Rajinikanth : లోకేష్ సహా చాలా మంది డైరెక్టర్లు ఉపేంద్ర నుంచి నేర్చుకోవాలి.. రజనీకాంత్ ప్రశంసలు

Highlights

కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర డైరెక్షన్ టాలెంటుకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆయన తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన, వినూత్నమైన చిత్రాలను రూపొందించారు.

Rajinikanth : కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర డైరెక్షన్ టాలెంటుకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆయన తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన, వినూత్నమైన చిత్రాలను రూపొందించారు. ఉపేంద్ర స్టైల్ చాలా మంది దర్శకులకు ఒక స్ఫూర్తి అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుత కాలం దర్శకులలో ప్రముఖుడు అయిన లోకేష్ కనగరాజ్ కూడా తన సినిమాలపై ఉపేంద్ర ప్రభావం ఉందని గతంలో ఒప్పుకున్నారు. ఇప్పుడు తాజాగా, తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ కూడా ఉపేంద్రపై ప్రశంసల వర్షం కురిపించారు.

ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన కూలీ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఉపేంద్ర ఒక గెస్ట్ రోల్‌లో కనిపించారు. అలాగే ఆమిర్ ఖాన్, అక్కినేని నాగార్జున వంటి స్టార్ నటులు కూడా ఈ సినిమాలో ఉన్నారు. సినిమా విడుదల నేపథ్యంలో జరిగిన ఒక ఈవెంట్‌లో రజినీకాంత్, ఉపేంద్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

ఈ ఈవెంట్‌లో రజినీకాంత్ మాట్లాడుతూ.. “ఉపేంద్ర ఇండియాలోని చాలా మంది డైరెక్టర్లకు స్ఫూర్తి. హిందీ, మలయాళం, తమిళం, తెలుగు వంటి అన్ని భాషల దర్శకులు ఉపేంద్రను చూసే వచ్చారు. ఆయన ఒక అద్భుతమైన దర్శకుడు” అని ప్రశంసించారు.

అంతేకాకుండా, ఉపేంద్ర తన నటన కంటే దర్శకత్వంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారని రజినీకాంత్ తెలిపారు. “ఉపేంద్ర, శివ రాజ్‌కుమార్ తో ఓం అనే సినిమా తీశారు. నాకు భాషా సినిమా ఎంత ముఖ్యమో, వారికి ఓం కూడా అంతే. కానీ నిజం చెప్పాలంటే నా భాషా సినిమా కంటే ఉపేంద్ర ఓం సినిమా చాలా గొప్పది. లోకేష్ కనగరాజ్ ఇప్పుడు చేస్తున్న పాత్రలను ఉపేంద్ర అప్పట్లోనే చేశారు” అని చెప్పి ఉపేంద్రను పొగడ్తలతో ముంచెత్తారు.

ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన ఓం, శ్! , ఎ, ఉపేంద్ర వంటి సినిమాలు కల్ట్ క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. ప్రతి సినిమా ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం ఉపేంద్ర దర్శకత్వం కంటే నటనపై ఎక్కువ దృష్టి పెట్టారు. అంతేకాకుండా, ఆయన ప్రజాకీయ అనే ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించి, ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories