Darbar: దర్బార్ రివ్యూ : రజినీ వన్ మ్యాన్ షో

Darbar: దర్బార్ రివ్యూ : రజినీ వన్ మ్యాన్ షో
x
Highlights

తెరపై పోలీస్ ఆఫీసర్‌గా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కనిపించి చాలా రోజులు అవుతుంది.

తెరపై పోలీస్ ఆఫీసర్‌గా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కనిపించి చాలా రోజులు అవుతుంది. ఇండియన్ స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో 'దర్బార్' అంటూ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రజినీ.. ముంబై బ్యాక్ గ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార నివేద థామస్,యోగిబాబు సునీల్ శెట్టి ముఖ్యపాత్రలు పోషించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎ మేరకు ఆకట్టుకొందో మన సమీక్షలో చూద్దాం..

కథ:

ముంబై కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించి డ్రగ్ మాఫియాను అంతంచేయాలనీ అనుకుంటాడు హీరో ఆదిత్య అరుణాచలం (రజినీకాంత్) ..దానికి ఎవరైనా అడ్డం వస్తే చంపడమే తన లక్ష్యంగా సాగుతుంటాడు. ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఇలా ఒక మ్యాడ్ పోలీస్ ఆఫీసర్ గా మారడం వెనుక కారణం ఏంటి? దానికేమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఇందులోకి సునీల్ శెట్టి ఎందుకు ఎంటర్ అయ్యాడు. ఇందులో నయనతార, నివేద థామస్పాత్రలు ఏంటి అన్నది తెరపైన చూడాలి.

ఎలా ఉందంటే?

రజినీకాంత్ నుంచి ఫ్యాన్స్ ఎలాంటి అంశాలు అయితే కోరుకుంటారో పక్కగా ఎలివేట్ చేశాడు దర్శకుడు ఎఆర్ మురగదాస్.. సీన్ సీన్ కి రజినీ మార్క్ కచ్చితంగా కనబడుతుంది. ఆదిత్య అరుణాచలం చేసే వరస ఎన్‌కౌంటర్లతో సినిమా మొదటి భాగం సాగుతూ ప్రేక్షకుడికి ఆసక్తిని కలిగిస్తాయి. కథ పాత సరుకే అయినప్పటకి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నాడు మురగదాస్.. మొదటిభాగం మొత్తం రజినీ స్టైల్ ని యాక్షన్ ఎపిసోడ్స్ తో కథను నడిపించిన మురగదాస్ రెండో భాగంలో ఎమోషన్స్ తో నడిపించాడు.

తన కూతురు అయిన నివేదా థామస్‌తో రజనీకాంత్ మధ్య ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. రజినీకాంత్ సినిమా అయినప్పటికీ తన టైప్ అఫ్ మార్క్ ని చూపించాడు మురగదాస్.. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు డ్రగ్స్, అమ్మాయిల అక్రమ రవాణా సోషల్ ఎలిమెంట్స్‌తో కథను బలంగా రాసుకొన్నాడు. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే లోకల్ రైల్వే స్టేషన్‌లో ఫైట్ సీన్ రజినీ అభిమానులతో ఈలలు వేయిస్తుంది. ఇక విలన్ సునీల్ శెట్టి, రజినీకాంత్ మధ్య బలమైన సన్నివేశాలు లేకపోవడం, క్లైమాక్స్ కూడా గొప్పగా లేకపోవడం సినిమాకి లోటుగా అనిపిస్తుంది.

నటినటులు:

సినిమా మొత్తానికి రజినీకాంత్ బిగ్గెస్ట్ హైలెట్ అని చెప్పాలి. 70 ఏళ్ళు వచ్చిన రజినీ స్క్రీన్ పైన నటించిన తీరు ఓ అద్భుతమని చెప్పాలి. పోలీస్ లుక్ లో రజినీ లుక్ అదిరిపోయింది. ఇక తన కూతురుగా నివేద థామస్ బాగా సెట్ అయింది. ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన బాగుంది. సినిమాలో నయనతార పెద్దగా లేకపోయినప్పటికీ ఉన్నంతలో పర్వాలేదని అనిపించింది. సునీల్ శెట్టి, యోగిబాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా, జతిన్ సర్న తదితరులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

ఇక సినిమా సాంకేతిక వర్గ నిపుణుల విషయానికి వచ్చేసరికి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రజినీకాంత్ ని చూపించిన విధానం బాగుంది. ఇక అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో బలంగా నిలిచింది.. లైకా ప్రొడక్షన్ నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచాయి.

చివరగా: రజినీ అభిమానులకి మాత్రం బొమ్మ అదిరిందని చెప్పాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories