బుల్లితెరలో రజనీ వర్సెస్‌ వైల్డ్‌ ఎప్పుడంటే

బుల్లితెరలో రజనీ వర్సెస్‌ వైల్డ్‌ ఎప్పుడంటే
x
మ్యాన్ వర్సెస్ వైల్డ్
Highlights

బుల్లితెరపై త్వరలో సందడి చేయనున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్.

బుల్లితెరపై త్వరలో సందడి చేయనున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్. సినిమాలతో బిజీగా ఉండే రజినీకాంత్ టీవీ షోలో చేశారు. కర్ణాటకలోని బందీపూర్‌ నేషనల్‌ పార్కులో మూడు రోజుల పాటు బేర్ గ్రిల్స్‌ తో కలిసి మ్యాన్ వర్సెస్ వైల్డ్ షూటింగ్ కూడా చేశారు రజినీ. జనవరి 28 జరిగిన ఈ షూటింగ్ లో ఆయన గాయపడటంతో కొన్ని రోజులు షూటింగ్ విరామం ప్రకటించి మళ్లీ పూర్తి చేశారు.

అయితే తాజా ఈ షోకు సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదలైంది. సాహసవీరుడు బేర్ గ్రిల్స్‌ తన ట్విట్టర్లో విడుదల చేసాడు. ఇక సూపర్ స్టార్‌ రజనీతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి సాహసవీరుడు బేర్ గ్రిల్స్ ట్వీట్ చేశారు. ఎంతోమంది సూపర్ స్టార్స్‌తో తాను వర్క్ చేసినా.. కూడా రజినీతో షూటింగ్ అనుభవం మాత్రం చాలా ప్రత్యేకం అంటూ తెలిపారు. త్వరలోనే ఈ షో సంబంధించి ఎపిసోడ్ ప్లే కానుంది. విడుదలైన మోషన్ పోస్టర్ చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చెన్నైలోనే జరుగుతుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories