సూపర్‌ స్టార్‌ మూవీ విడుదల తేదీ ఖరారు

సూపర్‌ స్టార్‌ మూవీ విడుదల తేదీ ఖరారు
x

అన్నాత్తే సినిమా 

Highlights

తలైవా రజనీకాంత్‌ అభిమానులు శుభవార్త. రజనీకాంత్ అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు 'అన్నాత్తే' సినిమా సంబంధించిన ఓ వార్త వచ్చింది.

తలైవా రజనీకాంత్ అభిమానులు శుభవార్త. రజనీకాంత్ అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు 'అన్నాత్తే' సినిమా సంబంధించిన ఓ వార్త వచ్చింది. ఈ సినిమాను ఏడాది నవంబర్‌ 4న దీపావళి సందర్భంగా థియేటర్లలలో విడుదల కాబోతున్నట్లు సన్‌ పిక్చర్స్ ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్‌లో పోస్టు పెట్టింది. 'నవంబర్‌ 4న అన్నాత్తే సినిమా విడుదల కాబోతుంది. సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్‌ చేసింది.

శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ సరసన జోడీగా నయనతార నటిస్తున్నారు. అలాగే కీర్తీ సురేశ్‌, మీనా, కుష్భూ, ప్రకాష్‌ రాజ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. సూపర్‌స్టార్‌ నటిస్తున్న168వ సినిమా ఇది. మురుగదాస్‌ దర్శకత్వంలో వచ్చిన దర్బార్‌ సుపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత వస్తుండడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాగా అనారోగ్యం కారణంగా కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు రజనీ. హైదరాబాద్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక చెన్నై వెళ్ళి అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. అన్నాత్తేలో ఓ పాటను దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించారు. ఇమాన్ అన్నాత్తే సంగీత అందించాడు. పాటల రికార్డింగ్ పూర్తి చేసాడు. బాలు పాడిన ఈ పాటను విడుదల చేయనున్నట్లు దర్శకనిర్మాతలు ప్రకటించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories