ఏమాత్రం అలరించలేకపోయిన రజినీకాంత్ లుక్

* సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే కొంత కాలం ఎదురు చూడాల్సిందే.

R Tripura Malini
Published on: 14 Dec 2022 7:00 AM IST
Rajini First Look From Jailer Did Not Entertain Audience
X

ఏమాత్రం అలరించలేకపోయిన రజినీకాంత్ లుక్

Jailer: సూపర్ స్టార్ రజనీకాంత్ ఈమధ్యనే తన 72వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రజినీ తదుపరి చిత్రం అయిన "జైలర్" నిర్మాతలు సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేశారు. రజినీకాంత్ ను "ముత్తువేల్ పాండియన్" అనే పేరుతో పరిచయం చేసిన ఈ వీడియో ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ ను అందుకుంటోంది. అసలు సినిమా ఎలా ఉన్నా కూడా రజనీ స్క్రీన్ ప్రెజెన్స్‌ ప్రేక్షకులను ఎప్పుడూ మెప్పిస్తునే ఉంటుంది.

కానీ ఈ సారి మాత్రం రజినీ స్క్రీన్ ప్రెజెన్స్ బాలేదు అని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. జైలర్ గా రజనీ గెటప్ బాగానే ఉంది కానీ డైరెక్టర్ రజినీ ని ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం అందరినీ నిరాశపరిచింది. సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే కొంత కాలం ఎదురు చూడాల్సిందే. ఇంకా సినిమా కి సంబంధించిన ప్రోమోలు, ట్రైలర్ విడుదల కాలేదు కానీ మామూలుగా రజినీ సినిమా అంటే ఉండే బజ్ ఈ సినిమాకి మాత్రం దక్కడం లేదు. రజనీని అందరూ ఎనర్జిటిక్ పాత్రలో చూడాలనుకుంటారు కానీ ఈ సినిమాలో మాత్రం రజినీ లుక్ అంత పవర్ ఫుల్ గా లేదేమో అని అనిపిస్తుంది.

ముఖ్యంగా ప్రమోషనల్ కంటెంట్ లో నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది కానీ ఈ సినిమాలో నేపథ్య సంగీతం కూడా ఏమాత్రం బాగాలేదు. అనిరుధ్ రవిచందర్ నుండి ఇలాంటి మ్యూజిక్ అసలు ఊహించలేదు అని అభిమానులు నిరాశ చెందుతున్నారు. సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జైలర్ 2023 వేసవిలో విడుదల కానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story