Jr NTR-Rajasekhar: ఎన్టీఆర్ సినిమా లో కనిపించనున్న సీనియర్ హీరో

Rajasekhars Role in the Movie Jr NTR and Koratala Siva | Telugu Movie News
x

ఎన్టీఆర్ సినిమా లో కనిపించనున్న సీనియర్ హీరో

Highlights

Jr NTR-Rajasekhar: ఎన్టీఆర్-కొరటాల సినిమాలో రాజశేఖర్ పాత్ర

Jr NTR-Rajasekhar: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన "భరత్ అనే నేను" సినిమా తో ఈమధ్యనే బ్లాక్ బస్టర్ అందుకున్న కొరటాల శివ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా ఈ మధ్యనే వాయిదా పడింది. అయితే కొరటాల శివ ఇప్పుడు తన తదుపరి సినిమా మీద ఫోకస్ చేయడానికి సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నారు కొరటాల.

తాజాగా ఈ సినిమా గురించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక సీనియర్ హీరో ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేయడానికి ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఆ సీనియర్ హీరో మరెవరో కాదు రాజశేఖర్. ఈమధ్యనే హీరో గా తన రెండవ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టిన రాజశేఖర్ గరుడ వేగ, కల్కి వంటి సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా ఇప్పుడు శేఖర్ అనే ఒక సినిమాతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్ పాత్ర ఎలా ఉంటుంది అనే విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇంకా వెలువడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories