Rajanikanth: సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న రజనీకాంత్

Rajani Gets Second Dose Vaccine
x

రజనీకాంత్   

Highlights

Rajanikanth: దేశ‌వ్యాప్తంగా క‌రోనా రెండో ద‌శ ఉదృతి కొన‌సాగుతోంది.

Rajanikanth: దేశ‌వ్యాప్తంగా క‌రోనా రెండో ద‌శ ఉదృతి కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ట్ట‌డి చ‌ర్య‌లు తీసుకున్నాయి. ప‌లు రాష్ట్రాల్లో లాక్ డౌన్ తో పాటు క‌ఠిన క‌ర్ఫ్యూ నిబంధ‌ల‌ను కూడా అమ‌లు చేస్తున్నారు. మ‌రో వైపు క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా కొన‌సాగుతుంది. కరోనా నుంచి రక్షించుకునేందుకు వ్యాక్సిన్ వేయించుకోవడమే బెటర్ అని నిపుణులు చెపుతున్న సంగతి తెలిసిందే. దీంతో, సామాన్యుల నుంచి సెలబ్రిటీలు కూడా పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.

ద‌క్షిణాది సూప‌ర్ స్టార్ రజనీకాంత్ కరోనా వ్యాక్సిన్ రెండో డోసును తీసుకున్నారు. జనీకాంత్ తన ఇంటిలోనే అయన వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా రజనీ పక్కన ఆయన కుమార్తె సౌందర్య ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. తన తాజా చిత్రం 'అన్నాత్తే' షూటింగ్ ను ముగించుకుని హైదరాబాద్ నుంచి నిన్ననే ఆయన చెన్నైకి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన ఆయనకు భార్య హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories