Rajani Kanth: రజనీతో మంచు లక్ష్మి ఫోటో వైరల్

Manchu Lakshmi And Rajani Photo Viral Social media
x

మంచు లక్ష్మి

Highlights

Rajani Kanth: డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ద‌క్షిణాది సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఫోటో సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతుంది.

Rajani Kanth: డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ద‌క్షిణాది సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తో క‌లిసి దిగిన ఫోటో సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. మంచు లక్ష్మి షేర్ చేసిన గంట వ్యవధిలోనే దాదాపు 14 వేల లైకులు వచ్చాయి. రజనీ తాజా చిత్రం 'అన్నాత్తే' హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం దాదాపు 35 రోజుల షెడ్యూల్ నేటితో్ కంప్లీటైంది. రజనీకాంత్ మోహన్ బాబు ఇంటికి రజనీకాంత్ వెళ్లినట్టు తెలుస్తోంది.

రజ‌నీ కాంత్, మోహ‌న్ బాబు మంచి మిత్రుల‌న్న సంగతి తెలిసిందే. రజనీ తాజా చిత్రం 'అన్నాత్తే' దర్శకుడు సిరుతై శివ డైరెక్ష‌న్ లో రూపొందుతుంది. నవంబర్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే యోచనలో దర్శకనిర్మాతలు ఉన్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, నయనతార, మీనా, ఖుష్బూ, కీర్తి సురేశ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories