రాజమౌళి, ఆయన భార్య రమ టార్చర్ వల్ల చచ్చిపోతున్నా - శ్రీనివాస్ రావు వీడియో

Pavan Reddy
Published on: 27 Feb 2025 7:21 PM IST
Srinivas Rao allegations on Rajamouli and his wife Rama Rajamouli
X

రాజమౌళి, ఆయన భార్య రమ వల్ల చచ్చిపోతున్నాను - శ్రీనివాస్ రావు వీడియో

Srinivas Rao allegations on Rajamouli and his wife Rama Rajamouli: డైరెక్టర్ రాజమౌళికి స్నేహితుడిగా చెప్పుకుంటున్న శ్రీనివాస రావు అనే వ్యక్తి ఒక సంచలన వీడియో రిలీజ్ చేశారు. రాజమౌళిపై ఆయన అనేక ఆరోపణలు చేస్తూ ఆ వీడియోను విడుదల చేశారు. ఇది కేవలం పబ్లిసిటీ కోసం చేస్తోన్న స్టంట్ కాదని, ఇది తన మరణ వాంగ్మూలం అని ఆయన ఆ వీడియోలో చెప్పారు. ఇంతకీ ఆయన చేస్తోన్న ఆరోపణలు ఏంటంటే... రాజమౌళి తనను వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. ఆ వేధింపులు తట్టుకోలేక తను చనిపోవడానికి సిద్ధమయ్యానని తెలిపారు.

శ్రీనివాస్ రావు ఏం చెబుతున్నారంటే...

దేశంలోనే టాప్ డైరెక్టర్ అయిన ఎస్ఎస్ రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. గుణ్ణం గంగరాజు, చంద్రశేఖర్ ఏలేటి, ఎంఎం కీరవాణి, మైత్రి మూవీ మేకర్స్ వంటి వారితో తను కలిసి పనిచేశాను. వాళ్లందరికీ రాజమౌళితో తన స్నేహం ఎలాంటిదో తెలుసు. 1990 నుండి మా మధ్య స్నేహం ఉంది. రామాయణం, మహా భారతంలో యుద్ధాలన్నీ ఆడవాళ్ల వల్లే జరిగాయని తెలుసు కానీ తమ మధ్య కూడా ఒక అమ్మాయి వల్లే గొడవ వస్తుందని అనుకోలేదు.

ఆర్య సినిమాలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ తరహాలో తమది కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీనే. ఏం చేద్దామని రాజమౌళిని అడిగితే నువ్వే నీ ప్రేమను త్యాగం చేయాల్సిందిగా చెప్పారు. అలా ఎలా కుదురుతుంది... ముగ్గురం కలిసే ఉందామని చెప్పా. అందుకు సమాజం ఒప్పుకోదని రాజమౌళి అన్నారు. నేను పెళ్లి చేసుకుంటా నలుగురం కలిసి ఉందామని రాజమౌళికి చెప్పాను. అది చాలా చెండాలంగా ఉంటుందని కుదరదు అన్నారు. కాలం అన్నీ మార్చేస్తుందని చెప్పి నన్నే త్యాగం చేయాల్సిందిగా చెప్పారు.

అప్పటికి రాజమౌళి ఇంకా శాంతి నివాసం సీరియల్ కూడా చేయలేదు. మాకు చేతిలో పని లేదు. అందుకే తనే రాజీపడ్డాను. కానీ ఇప్పుడు ఆ విషయం అందరికీ చెబుతానేమో అనే భయంతో ఆ ఇద్దరూ తనను తీవ్రంగా వేధిస్తున్నారు అని రాజమౌళిపై, ఆయన భార్య రమా రాజమౌళిపై శ్రీనివాస్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఇది పబ్లిసిటీ కోసం చేయడం లేదని, పబ్లిసిటీ కోసం వీడియోలు చేసే వారు చచ్చిపోవడానికి సిద్ధపడరని శ్రీనివాస్ రావు అభిప్రాయపడ్డారు. ఆయన చేసిన ఈ ఆరోపణలపై రాజమౌళి కుటుంబం ఏమని స్పందిస్తుందనేదే ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది.

Pavan Reddy

Pavan Reddy

Next Story