ప్రపంచమే నిలిచిపోవడం షాకింగ్ గా వుంది: రాజమౌళి

ప్రపంచమే నిలిచిపోవడం షాకింగ్ గా వుంది: రాజమౌళి
x
S. S. Rajamouli (file photo)
Highlights

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. దాన్ని అరికట్టేందుకు సినిమా, టీవీ సీరియల్స్, డిజిటల్ షో షూటింగ్స్ ను ఆపేయాలని చిత్ర పరిశ్రమ నిర్ణయం తీసుకున్నారు.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. దాన్ని అరికట్టేందుకు సినిమా, టీవీ సీరియల్స్, డిజిటల్ షో షూటింగ్స్ ను ఆపేయాలని చిత్ర పరిశ్రమ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి సినిమా షూటింగ్స్ నిలిపివేస్తున్నామని ఫిల్మ్ చాంబర్ వెల్లడించింది. మార్చి 31 వరకు అన్నీ షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయించారు.

కరోనా ప్రస్తుతం ప్రపంచాన్నే వణికిస్తున్న పేరు. కరోనా వైరస్ మొదట చైనా దేశంలో మొదలైంది అందుకే కాబోలు దీనిని చైనా వైరస్ అని కూడా అంటూవుంటారు. ఈ కరోనా వైరస్ మెల్లమెల్లగా ఇతర దేశాలకు వ్యాపిస్తుంది, ఇది సుమారు 145 దేశాలలో వ్యాపించింది. అయితే ఈ వైరస్ రాకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఈ వైరస్ ని ఎదుర్కోవటానికి మానవాళి అంతా ఒక్కటై ఒకరికొకరు సాయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ నేపధ్యంలో దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజ‌మౌళి కరోనా వైరస్‌పై స్పందించారు. 'క‌రోనా కార‌ణంగా ప్రపంచం నిలిచిపోవ‌డం చూస్తుంటే షాకింగ్‌గా ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల‌లోనే మనం భ‌యాందోళ‌న‌లు వ్యాప్తి చెంద‌కుండా చూడాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. కోవిడ్ 19 వ్యాప్తిని నివారించ‌డానికి తగిన చర్యలను పాటించండి. కరోనాపై అప్రమ‌త్తంగా ఉంటే మంచిది' అని రాజమౌళి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో చాల మంది విదేశీ నటినటులు ఉన్న విషయం తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. అయితే తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రంగాల వారి సహకారం కావాలని సీఎం కేసీఆర్ పిలుపినిచ్చారు. అయితే క్రీడలను వాయిదా వేయడం, స్కూల్స్, కళాశాలలకు సెలవులు ప్రకటించడంతోపాటు మాల్స్, సినిమా థియేటర్లను మూసివేయడం తదితర చర్యలు తీసుకోవడం చర్యలు తీసుకోవాని కేసీఆర్ పిలుపునిచ్చారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories