Rajamouli: క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు స్పెషల్ గిఫ్ట్ పంపిన దర్శకధీరుడు!

Rajamouli: క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు స్పెషల్ గిఫ్ట్ పంపిన దర్శకధీరుడు!
x

Rajamouli: క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు స్పెషల్ గిఫ్ట్ పంపిన దర్శకధీరుడు!

Highlights

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు తెలుగులో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి కొత్త సినిమా వచ్చినా మన హీరోల డైలాగులు, పాటలతో ఆయన చేసే రీల్స్‌ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటాయి..

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు తెలుగులో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి కొత్త సినిమా వచ్చినా మన హీరోల డైలాగులు, పాటలతో ఆయన చేసే రీల్స్‌ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటాయి. తాజాగా ఆయన బాహుబలి గెటప్‌లో చేసిన పాత టిక్‌టాక్ వీడియోలు, ఫోటోలను మళ్లీ షేర్ చేశాడు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరింది.

ఈ క్రమంలో బాహుబలి రీ రిలీజ్ నేపథ్యంలో వార్నర్ వేసుకున్న గెటప్‌ను చూసిన దర్శకుడు రాజమౌళి స్పందిస్తూ, ‘‘హలో డేవిడ్.. ఇక నుంచి నువ్వే మాహిష్మతిలో నిజమైన రాజు. నీకు ఆ కిరీటాన్ని గిఫ్ట్‌గా పంపిస్తున్నా’’ అంటూ కామెంట్ చేశారు. దీనిపై డేవిడ్ వార్నర్ కూడా ఆనందంగా స్పందిస్తూ.. "వెయిట్ చేస్తా" అంటూ రిప్లై ఇచ్చాడు.

ఇంతలో బాహుబలి టీమ్ డేవిడ్ వార్నర్‌ను ఆస్ట్రేలియాలో బాహుబలి రీ రిలీజ్ ప్రదర్శనకు ఆహ్వానించింది. ఇది సంబంధించిన ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రభాస్ హీరోగా, రానా విలన్‌గా నటించిన బాహుబలి సినిమా తెలుగు చలనచిత్ర రంగంలో మైలురాయి సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు దానికి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అక్టోబర్‌లో రెండు పార్టులను కలిపి ఒక్క సినిమాగా మళ్లీ విడుదల చేయనున్న విషయం తెలిసిందే.

ఈ సంధర్భంగా దర్శకధీరుడు రాజమౌళి నుంచి డేవిడ్ వార్నర్‌కు వచ్చిన ఈ గిఫ్ట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories